Homeలైఫ్ స్టైల్Pan Masala Business: మన వ్యసనం వీరికి ఆదాయం..ఈ నాలుగు సంస్థల వ్యాపారం ఏకంగా 46...

Pan Masala Business: మన వ్యసనం వీరికి ఆదాయం..ఈ నాలుగు సంస్థల వ్యాపారం ఏకంగా 46 వేల కోట్లు!

Pan Masala Business: ఉదయాన్నే నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎనిమిది గంటల లోపు టిఫిన్ తినాలి. మధ్యాహ్నం ఒంటిగంటలోపు భోజనం చేయాలి. సాయంత్రం ఏడు గంటల లోపు ఏదో ఒకటి లైట్ ఫుడ్ తీసుకోవాలి. మధ్యలో పండ్లు తినాలి. ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. పొగ తాగకూడదు. మద్యాన్ని సేవించకూడదు. సాధ్యమైనంతవరకు వ్యసనాలకు దూరంగా ఉండాలి. త్వరగా పడుకోవాలి. వైద్యుల దగ్గరికి వెళితే ఇవన్నీ మనకు చెబుతుంటారు. కచ్చితంగా ఆచరించాలని సూచిస్తారు. కానీ ఇందులో ఆచరించే వారు ఎవరు.. పాటించే వారెవరు. డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే.. వాళ్ళు చెప్పిన మాటలకు తల ఊపుతాం. ఆ తర్వాత మనం చేయాల్సింది చేస్తాం.

ఆర్థిక స్థిరత్వం పెరుగుతున్న నేపథ్యంలో చాలామందికి రకరకాల వ్యసనాలు అలవాటు అవుతున్నాయి. ఇందులో ధూమపానం, మద్యపానం మాత్రమే కాదు.. పాన్ మసాలాలు తినడం కూడా ఒక దురాల వాటే. చాలామందికి వ్యసనాలు అంటే ధూమపానం, మద్యపానం మాత్రమే గుర్తుకు వస్తాయి. అని ధూమ, మద్యపానం చేసే వారి కంటే ఎక్కువగా పాన్ మసాలాలు తినే వారు ఉంటారు. పాన్ మసాలాలు ఆరోగ్యానికి చేటుచేస్తాయి. వీటిని అదే పనిగా నమలడం వల్ల నోటి క్యాన్సర్లు సోకుతాయి. ఇక అల్సర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవరు కూడా పాన్ మసాలాలు తినకుండా ఉండలేకపోతున్నారు.

Also Read: 2008 నుంచి 2017 మధ్య పుట్టిన వారికి క్యాన్సర్. ప్రమాదంలో 1.56 కోట్ల మంది

మనదేశంలో పాన్ మసాలాల వ్యాపారం 46 వేల కోట్లకు చేరుకుంది. ఈ వ్యాపారంలో అతిపెద్ద సంస్థగా రజనీగంధ కొనసాగుతోంది. డీఎస్ గ్రూపుకు చెందిన ఈ సంస్థ రెవెన్యూ ఏకంగా 10,000 కోట్ల వరకు ఉంది. రజనీగంధ కు పెద్ద పెద్ద సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. రజని గంధ తర్వాత విమల్ గ్రూప్ రెండవ సంస్థగా కొనసాగుతోంది. ఈ సంస్థ రెవెన్యూ 1600 కోట్ల వరకు ఉంది. విమల్ పాన్ మసాలాకు అజయ్ దేవగన్, ఇతర సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. రజనీగంధ, విమల్ తర్వాత మూడో స్థానంలో పాన్ విలాస్ సంస్థ కొనసాగుతోంది. ఈ సంస్థకు పాన్ మసాలా వ్యాపారంలో 20% వాటా ఉంది. లగ్జరీ బ్రాండింగ్ టేస్ట్ లో ఈ కంపెనీకి పేరుంది.. ఇక నాలుగో స్థానంలో కొఠారి ప్రొడక్ట్స్ తయారు చేసే పాన్ పరాగ్ ఉంది. ఈ కంపెనీ రెవెన్యూ మొత్తం 900 కోట్ల వరకు ఉంది. అత్యంత ప్రాచీనమైన కంపెనీగా పాన్ పరాగ్ కొనసాగుతోంది.

వాస్తవానికి పాన్ మసాలాలు తినడం ఆరోగ్యానికి హానికరం. వీటివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతాయి. ఈ కంపెనీలు విక్రయించే ప్యాకెట్ల మీద హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎవరూ తినకుండా ఉండలేకపోతున్నారు. ఈ నాలుగు కంపెనీలు దాదాపు 46వేల కోట్ల మార్కెట్ ను శాసిస్తున్నాయి. కంపెనీల ద్వారా ప్రభుత్వానికి కూడా భారీగానే పన్నులు వస్తున్నాయి. అయితే పాన్ మసాలాలు ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ ప్రభుత్వం నిషేధించకపోవడంతో.. ఈ కంపెనీల లాభాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నాయి. మనదేశంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు కావడానికి ప్రధాన కారణం మద్యం, రెండవ కారణం పొగాకు తాగడం అయితే.. మూడవది పాన్ మసాలాలు తినడం.. ఇప్పటికైనా ఈ వ్యసనాలు అలవాటు ఉన్నవారు మానుకుంటే మంచిది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular