ORS: ప్రపంచంలో అవసరం మేరకు అనేక ఆవిష్కరణలు జరుగుతాయి. ఇందులో భాగంగానే కోట్ల మంది ప్రాణాలు కాపాడిన ఓఆర్‌ఎస్(ORS & Oral Rehydration Solution) ను ఆవిష్కరించారు. జ్వరం వచ్చినా, వాంతులు, విరోచనాలు అయినా వైద్యులు ఓఆర్‌ఎస్‌నే రిఫర్‌చేస్తారు. నీరసంగా ఉన్నప్పుడు చాలా మంది ఓఆర్‌ఎస్ తీసుకుంటారు. అయితే ఈ ఓఆర్‌ఎస్‌ను భారతీయ వైద్యుడు బెంగాళ్‌కు చెందిన డాక్టర్ దిలీప్ మహాలబిస్. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయయంలో తూర్పు పాకిస్తాన్‌కు చెందిన లక్షలాది మంది బెంగాల్‌కు వలస వచ్చారు. శరణార్ధులుగా వచ్చినవారు బెంగాల్‌లోని పలు శిబిరాల్లో ఆశ్రయం పొందారు. ఈ సమయంలో వర్షాలు, వరదలు రావడంతో శరణార్థి శిబిరాల్లో శానిటేషన్ లోపించింది. తాగునీరు కలుషితమైంది. దీంతో కలరా వ్యాపించింది. దీంతో డాక్టర్ మహాలంబిస్ తన టీంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. చికిత్స ప్రారంభించారు. పెరుగుతున్న కేసులకు వేగంగా చికిత్స అందించే సిబ్బంది నాడు లేకపోవడంతో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది.
సెలైన్ నుంచి ఓఆర్‌ఎస్..
సిబ్బంది కొరత, కేసులు పెరుగుతుండంతో అప్పటి వరకు సెలైన్ ద్వారా ఇచ్చిన ఓఆర్‌ఎస్‌ను.. నోటి ద్వారా ఇవ్వాలని భావించారు. ఇందుకోసం ఆయన ఓరల్‌గా ఇవ్వడానికి లీటర్ నీటిలో 22 గ్రాముల గ్లూకోస్, 3.5 గ్రాముల సోడియం క్లోరైడ్, 2.5 గ్రాముల సోడియం బైకార్బొనేట్ కలిపి ఓఆర్‌ఎస్‌ను తయారు చేశారు. ఓఆర్ ఎస్ అంటే ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్. ఈ ద్రావణం శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. మహా నంబిస్ గారు చేసిన కృషికి ఆయన మరాణంతరం 2023లో భారత ప్రభుత్వం పద్మ విభూషన్‌తో సత్కరించింది.
ఓఆర్‌ఎస్ ప్రత్యేకతలు:
1. రీస్టోరేషన్ ఆఫ్ లిక్విడ్: శరీరంలో ఉన్న నీటిని, సోడియం, ప్యాటాసియం వంటి ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి పూరణ చేస్తుంది.
2. దీనిలో సాల్ట్ (పొడి ఉప్పు), షుగర్ (చక్కెర) మరియు నీరు ఉంటాయి. ఇది ఆవిరైపోవడాన్ని అరికట్టి శరీరానికి అవసరమైన మూలకాల సరఫరా చేస్తుంది.
3. శరీరంలో నీటి కొరతను పెంచే దీర్ఘకాలిక వ్యాధులలో, డీహైడ్రేషన్ యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.
4. ఇది లోపల తీసుకుంటే, అల్ప శక్తి వినియోగంతో శరీరం ద్రావకాలను పునరుద్ధరిస్తుంది, ముఖ్యంగా చిన్న పిల్లలలో మరియు వయోజనుల్లో డీహైడ్రేషన్ విషయంలో ఈ పరిష్కారం అత్యంత ప్రభావవంతం.
5. డయేరియా వంటి వ్యాధుల కారణంగా కలిగే నీటి కొరతను తగ్గించడంలో ఓ ఆర్ ఎస్ అత్యంత అవసరమైన పరిష్కారం అవుతుంది.