Obesity : మీ బరువు పరిమితికి మించి పెరిగితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు ఊబకాయంతో బాధపడుతుంటే ఇది మాత్రమే కాదు అనేక ఇతర వ్యాధులు కూడా మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఇది మేము చెప్పడం లేదు, కానీ ఇటీవలి అధ్యయనం ఈ విషయాన్ని చెప్పింది. ఊబకాయం ఉన్నవారికి 16 సాధారణ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది. దీనిలో, మీకు నిద్రలేమి సమస్య ఉండవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. అలాగే, టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ మొదలైన వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
Also Read : తందూరి ఛాయ్ చేయాలంటే ఇంత కష్టమా?
ఇక ఈ ఊబకాయంతో ఏపీ, టీజీ రాష్ట్రాల్లో 82 శాతం మంది బాధ పడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ఏకంగా 25 లక్షల మందిని టెస్ట్ చేసి ఈ విషయం తెలిపారు. 81 శాతం మందిలో విటమిన్ డి లోపం ఉందట. ప్రతి ఇద్దరిలో ఒకరికి గ్రేడ్ 1 ప్యాటీ లివర్ సంకేతాలు ఉన్నాయట. ఇక 77 శాతం మహిళల్లో పోషకాహార లోపంతో, పిల్లలు, కాలేజీ విద్యార్థులు 28 శాతం అధిక బరువుతో బాధ పడుతున్నారు అని తేలింది.
కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?
ఒక వ్యక్తి BMI (బాడీ మాస్ ఇండెక్స్) 40 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, లేదా BMI 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి ఊబకాయం సంబంధిత వ్యాధులు ఉంటాయి. అయినా సరే దానిని ‘తీవ్రమైన ఊబకాయం’ లేదా ‘తరగతి 3 ఊబకాయం’ అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. ఊబకాయం మీ శరీరంలోని అనేక భాగాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దాని వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే, మునుపటి అధ్యయనాలు ప్రతి వ్యాధిని విడివిడిగా పరిశీలించాయి. దీనివల్ల ఊబకాయం మొత్తం ప్రభావాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం (USA) శాస్త్రవేత్తలు అమెరికాలోని 2.7 లక్షలకు పైగా ప్రజల నుంచి డేటాను విశ్లేషించారు. ప్రజలలో ఊబకాయం పెరిగేకొద్దీ, మొత్తం 16 వ్యాధుల సంభవం కూడా పెరిగిందని వారు కనుగొన్నారు. మొదటి వర్గంలో 21.2 శాతం మంది, రెండవ వర్గంలో 11.3 శాతం మంది, మూడవ వర్గంలో 9.8 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం అన్ని వ్యాధులతో ముడిపడి ఉందని తేలింది. ఊబకాయం వర్గం పెరిగేకొద్దీ, వ్యాధుల ప్రమాదం కూడా పెరిగింది.
ఊబకాయం 16 వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది
వీటిలో అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, హైపర్లిపిడెమియా/డైస్లిపిడెమియా, గుండె ఆగిపోవడం, సక్రమంగా లేని హృదయ స్పందన, అథెరోస్క్లెరోటిక్ గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, పల్మనరీ ఎంబాలిజం, శరీరంలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం, గౌట్, కొవ్వు కాలేయం (జీవక్రియకు సంబంధించినది), పిత్తాశయ రాళ్ళు, స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస ఆగిపోవడం), ఆస్తమా, ఆమ్లతత్వం, గుండెల్లో మంట (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్), ఎముక కీళ్ల వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) వంటివి వస్తాయి. వీటిలో, ఊబకాయం, స్లీప్ అప్నియా, టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ మధ్య అత్యధికంగా వస్తాయట.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.