Obesity: ఊబకాయులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదాలు ఎక్కువే?

Obesity: ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువు అంటారు. అది ఎన్ని కిలోలైనా కావచ్చు. మన ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది సమాన బరువు అవుతుంది. అంతేకాని ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఉంటే దాన్నే అధిక బరువుగా పరిగణిస్తారు. ఇంకా ఎక్కువగా ఓ పది ఇరవై కిలోలు ఎక్కువగా ఉంటే దాన్ని ఊబకాయంగా చెబుతారు. ఇవి మన దేహానికి మంచివి కావు. మన ఆరోగ్యాన్ని పాడు చేసేవిగా ఉంటాయి. ఎందుకంటే […]

Written By: Srinivas, Updated On : March 5, 2023 11:03 am
Follow us on

Obesity

Obesity: ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువు అంటారు. అది ఎన్ని కిలోలైనా కావచ్చు. మన ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది సమాన బరువు అవుతుంది. అంతేకాని ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఉంటే దాన్నే అధిక బరువుగా పరిగణిస్తారు. ఇంకా ఎక్కువగా ఓ పది ఇరవై కిలోలు ఎక్కువగా ఉంటే దాన్ని ఊబకాయంగా చెబుతారు. ఇవి మన దేహానికి మంచివి కావు. మన ఆరోగ్యాన్ని పాడు చేసేవిగా ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి తన శక్తిసామర్థ్యాలకు సరిపోయే బరువును మోస్తాడు. కానీ అదనంగా ఓ పదికిలోలు నెత్తిమీద పెడితే మోస్తాడా? మోయలేడు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది.

అధిక బరువు అనర్థమే..

Obesity

అధిక బరువుతో ఇబ్బందులే ఏర్పడతాయి. మధుమేహం. హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, రక్తపోటు, స్ట్రోక్, మానసిక, ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయినా ఎవరు కూడా లెక్క చేయడం లేదు. దీంతో తమ శరీరం తమకే బరువుగా అనిపిస్తుంది. కొంత దూరమైనా అలసట లేకుండా నడవలేరు. దీంతో ఆయాసం వస్తుంది. చెమటలు పడతాయి. ఫలితంగా ఎన్నో రకాల జబ్బులకు కేంద్రంగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో అధిక బరువును అందరు నియంత్రణలో ఉంచుకోకపోతే ముప్పే అని గ్రహించుకోవాలి.

Also Read: ‘Writer Padmabhushan’ OTT release : ‘రైటర్ పద్మభూషణ్’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది

ఇతర అవయవాలపై..

ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కీలక ట్వీట్లు చేసింది. ఊబకాయంతో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని సూచించింది. హృదయం, కాలేయం, మూత్రపిండాలు, కీళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉందని తెలియజేసింది. ఊబకాయంతో ఒళ్లు బరువుగా ఉంటుందని చెప్పింది. దీని వల్ల అనేక అనర్థాలకు దారి తీస్తుందని వివరించింది. ఊబకాయులు తమ ఒళ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అన్నది.

మరి ఏ ఆహారాలు తినాలి?

అధిక బరువు, ఊబకాయంతో ఉన్న వారు తేలికైన ఆహారాలు తీసుకోవాలి. మాంసాహారాల జోలికి వెళ్లకూడదు. వాటిని తినడం వల్ల ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. స్వీట్లు తినొద్దు. బేకరి ఫుడ్స్ కు మొగ్గు చూపకూడదు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకుని బరువును పెరగకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే అనేక రకాల వ్యాధుల బారిన పడితే ఇక ఆ దేవుడే రక్షించలేడు. అందుకే అధిక బరువును అదుపులో ఉంచుకోకపోతే భవిష్యత్ లో మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

Also Read: Ananya Nagella: సర్జరీ చేయించుకొని కెరీర్ ని నాశనం చేసుకున్న ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగేళ్ల