Nutmeg: అనారోగ్య సమస్యలను క్లియర్ చేసే మెడిసిన్ మన వంటింట్లోనే ఉంటాయి. జాజికాయలు అందరి ఇంట్లో ఉంటాయి. సాధారణంగా వీటిని డైలీ వాడరు. కానీ ఏదైనా మసాలా కర్రీ, చికెన్, మటన్ ఇలా చేసేటప్పుడు తప్పకుండా వీటిని వాడుతారు. వీటిని వంటల్లో వాడటం వల్ల కూరలు టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే జాజికాయను కేవలం వంటలకు మాత్రమే కాకుండా తినడం లేదా వాటర్ తాగడం వంటివి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీర్ఘకాలికంగా బాధపడుతున్న సమస్యల నుంచి విముక్తి చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. నిజం చెప్పాలంటే ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరి జాజి కాయ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసిడిటీ నుంచి ఉపశమనం
జాజి కాయ వాటర్‌ను డైలీ ఉదయం తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు తప్పకుండా జాజికాయ వాటర్‌ను డైలీ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు ప్రేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే నిద్రలేమి సమస్య నుంచి విముక్తి కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు అంటున్నారు.
రక్తపోటు నియంత్రణలో..
జాజికాయ వాటర్‌ను తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. డైలీ జాజి కాయ వాటర్ తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి కూడా విముక్తి చెందుతారని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులోని పోషకాలు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డైలీ జాజికాయ వాటర్‌ను తాగడం మరిచిపోవద్దు.
ఏ సమయంలో తాగాలంటే?
జాజికాయ వాటర్‌ను రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో ఎక్కువగా కాకుండా కేవలం తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇలా డైలీ జాజి కాయ వాటర్ తాగితే నిద్ర లేమి అనే కాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
జాజికాయ వాటర్ ఎలా చేయాలంటే?
జాజికాయను ఎండబెట్టి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఈ పౌడర్ వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత వడబోసి చల్లార్చుకోవాలి. అంతే ఇక జాజికాయ వాటర్ రెడీ.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.