Hand Wash: చేతులు సరిగా కడుక్కోవడం లేదా.. మీ మెదడుకు ముప్పు తప్పదు?

కడుపులో ఇన్‌ఫెక్షన్లు కూడా చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. చేతుల్లోని సూక్ష్మక్రిములు నోటి ద్వారా కడుపులోకి చేరుతాయి. ఇవి కడుపు నొప్పి, విరేచనాలు, వికారం, వాంతులకు కారణమవుతాయి. చేతులు కడుక్కోకుండా ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.

Written By: Raj Shekar, Updated On : March 20, 2024 8:33 am

Hand Wash

Follow us on

Hand Wash: హ్యాండ్‌వాష్‌.. జీవినశైలిలో ఇప్పుడు ఇదే ముఖ్యమైన అంశంగా మారింది. చేతుల ద్వారానే మనకు అనేక వ్యాధులు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. అందుకే హ్యాండ్‌వాష్‌ కోసం ఒక డే కూడా నిర్వహిస్తున్నారు. ఇక కరోనా తర్వాత హ్యాండ్‌ వాష్‌పై అందరికీ అవగాహన పెరిగింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక మళ్లీ శుభ్రం చేసుకునే అలవాటు మర్చిపోతున్నారు. చేతులు కడుక్కుంటే చాలా వ్యాధులు మన దరి చేరవు. మనం బయట తిరిగి వస్తాం. ఇంట్లో అమ్మ చేతులు, కాళ్లు కడుక్కో అని చెబుతుంది. కానీ అది పట్టించుకోం. నేరుగా వంటింటిలోకి వెళ్లి.. అన్ని చూస్తాం. ఏదైనా తీసుకుని తినేస్తాం. అయితే ఇలా బయట నుంచి వచ్చినప్పుడు చేతులు కడుక్కోకుంటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అందుకే శుభ్రంగా ఉండాలి. తర్వాత ఆసుపత్రులకు డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి రాదు.

అంటు వ్యాధుల ముప్పు..
అంటు వ్యాధులు ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. ఈ వ్యాధులకు అపరిశుభ్రమైన చేతులు వారధిగా మారుతున్నాయి. కరోనాతోపాటు అనేక జీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి మురికి చేతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకుంటాం. తర్వాత ఎవరో ఒకరికి షేక్ హ్యాండ్ ఇస్తాం. మీ చేతుల నుంచి బ్యాక్టీరియా వారికి చేరుతుంది. దీంతో సమస్య పెద్దది అవుతుంది. ఇతరులు కూడా మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడూ అదే సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ చేతులను సబ్బుతో కేవలం 20 సెకన్ల పాటు కడుక్కోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.

వైరల్ ఫ్లూ..
తిన్న ప్రతీసారి, లేదా బయటి నుంచి వచ్చిన ప్రతీసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే సీజనల్‌ వ్యాధులు దరి చేరవు. వాతావరణం మారిన ప్రతీసారి వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. సీజనల్ వైరల్ వ్యాధులను నివారించడానికి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత తింటే బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లదు.

కడుపు ఇన్‌ఫెక్షన్లు..
కడుపులో ఇన్‌ఫెక్షన్లు కూడా చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. చేతుల్లోని సూక్ష్మక్రిములు నోటి ద్వారా కడుపులోకి చేరుతాయి. ఇవి కడుపు నొప్పి, విరేచనాలు, వికారం, వాంతులకు కారణమవుతాయి. చేతులు కడుక్కోకుండా ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.

శ్వాసకోశ వ్యాధులు..
శ్వాసకోశ వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందడానికి కూడా మన చేతులే కారణం. చేతులకు ఇన్‌ఫెక్షన్‌ సోకి, అవే చేతులను ముఖం మీద, ముక్కు, కళ్లు, నోటిని తాకితే ఆ ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోకి వెళ్తుంది. ఇది జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలకు కారణమవుతుంది.

మెదడుకు ముప్పు..
ఇక తాజాగా చేతులు కడుక్కోపోవడం ద్వారా మెదడుకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అపరిశుభ్రమైన చేతుల కారణగా టేప్‌ వార్మ్‌(బద్దె పురుగు) మెదడులోకి ప్రవేశిస్తున్నట్లు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ కేస్‌ రిపోర్ట్‌ పేర్కొన్నాయి. బద్దె పురుగు చేతుల ద్వారా కణజాలంలోకి వెళ్లి అక్కడి నుంచి మెదడులోకి వెళ్తుందని తెలిపారు. ఉడకని పంది మాంసం తినేవారిలోనూ టెప్‌వార్మ్‌ను గుర్తించారు. టేప్‌ వార్మ్‌ ఉన్నవారి మలం, మూత్రాల ద్వారా కుటుంబ సభ్యులకూ సోకే ప్రమాదం కూడా ఉందని నిర్ధారించారు.