Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్. అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ లను అందుకుంటు ఉండేవి. ముఖ్యంగా యూత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో పూరి జగన్నాథ్ మొదటి స్థానంలో ఉంటాడు. అయితే పూరి జగన్నాథ్ చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. కానీ ఒక సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో చాలావరకు డిసప్పాయింట్ చేసింది.
అది ఏ సినిమా అంటే చార్మి మెయిన్ లీడ్ లో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది. ఈ సినిమాలో కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల దీనికి అదే మైనస్ గా మారింది. దానివల్ల ఈ సినిమా పెద్దగా ఆడలేదు. లేకపోతే ఈ సినిమా లో ఒక మంచి మెసేజ్ ను ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆడలేదు ఒక దానికి ముఖ్య కారణం. ఈ సినిమాలో ఛార్మి డైలాగ్స్ చాలా ఓవర్ గా ఉండడమే అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఫ్లాప్ అవుతుందని పూరి కి ముందే తెలుసట… ఎందుకంటే ఆయన చేసిన సినిమా కాబట్టి ఆయనకి తెలిసినంత బాగా మనకు తెలియదు.
ఇక అలాగే ఆయన సినిమా కాబట్టి అది ఫ్లాప్ అవుతుందని బయటకు చెప్పుకోలేడు కానీ, ఆ సినిమా చూసినప్పుడు మాత్రం ఇది ఫ్లాప్ అవుతుందని అనిపించిందట. ఇక మొత్తానికైతే ఎలాగోలాగా సినిమాకి సంబంధించిన ఈవెంట్లు నిర్వహించి సినిమా మీద బజ్ క్రియేట్ చేసి సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందడంలో చాలా వరకు ఫెయిల్ అయింది. ఇక ఈ సినిమాలో ఛార్మి కూడా సినిమా ప్లాప్ కి కారణం అనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పూరి ఒక భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇక అప్పటినుంచి ఛార్మి కూడా పూరి జగన్నాథ్ తో పాటు ప్రొడక్షన్ హౌజ్ లో భాగమై పోయి పూరి తో పాటు తను కూడా ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ చాలా బిజీగా మారిపోయింది…