Sleeping Tips: సరిగ్గా నిద్ర పట్టడం లేదా? బటర్‌ఫ్లై ట్యాపింగ్‌ టెక్నిక్‌ చాలు..

ఎక్కువ ఆలోచించడ వల్ల చాలా సమస్యలు వస్తాయి. కానీ ఆలోచనలు లేకుండా ఎలాంటి పనిని మొదలు పెట్టవద్దు. ఆ.చి తూ.చి ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవాలి.

Written By: Chai Muchhata, Updated On : August 1, 2024 12:41 pm

Sleeping Tips

Follow us on

Sleeping Tips: ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. మానవ జీవితం నుంచి జంతువులు, పశుపక్షాదుల వరకు నిద్ర కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎన్ని గంటలు పడుకుంటున్నారు? ఏ సమయంలో పడుకుంటున్నారు అనే విషయాలు కూడా నిద్రను దోహదం చేస్తాయి. అయితే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ఒత్తిడి సహజంగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారికి నిద్రలో నాణ్యత లోపిస్తుంది. రాత్రిళ్లలో లైట్లు, గ్యాడ్జెట్లను స్విచాఫ్‌చేసినా సరే నిద్ర మాద్రం సరిగ్గా పట్టు. మనిషి బెడ్ మీద పడుకున్నా మనసు మాత్రం టికెట్ లేకుండా ప్రపంచాన్ని చుట్టి వస్తుంటుంద. దీని నుంచి బయట పడాలంటే బటర్‌ఫ్లై ట్యాపింగ్‌ టెక్నిక్‌ ను అనుసరించాలి అంటున్నార సోమాటిక్‌ యాంగ్జాయిటీ నిపుణులు జోలీ స్లోవిస్‌. అసలు ఈ టెక్నిక్ ఏంటి? ఎందుకు ఉపయోగించాలి? అనే వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

ఎక్కువ ఆలోచించడ వల్ల చాలా సమస్యలు వస్తాయి. కానీ ఆలోచనలు లేకుండా ఎలాంటి పనిని మొదలు పెట్టవద్దు. ఆ.చి తూ.చి ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవాలి. అలాగని, రాత్రి నిద్రపోయాక కూడా మెదడును ఆలోచనలు తొలి చేస్తుంటే.. మాత్రం శరీరం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంటుందట. ప్రతి మనిషి జీవితంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కాలంలో జీవనశైలిలో వచ్చిన మార్పులు, పని ఒత్తిడి వంటి సమస్యలు మనిషి నిద్రన చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి.

నిద్ర కరవైతే మనిషికి నీరసం, నిస్సత్తువ వస్తుంటాయి. ఏకాగ్రత లోపించి యాక్టివ్ గా ఉండరు . నిద్రలో కూడా మెదడు పుట్టెడు ఆలోచనలతో నిండి ఇబ్బంది పెడుతుంటే.. బటర్‌ఫ్లై ట్యాపింగ్ టెక్నిక్‌ను ప్రయత్నించి చూడాలంటున్నారు నిపుణులు. అయితే దీన్ని ఎలా చేయాలంటే.. ఇందుకోసం మీ రెండు అర చేతుల్ని ఛాతిపై ఉంచి బొటనవేళ్లను ఓ కొక్కెం మాదిరిగా జోడించి. సీతాకోక చిలుక ఆకారంలో చేతుల్ని ఉంచి ఛాతీపై ఎడమ, కుడి అరచేతులతో ప్రత్యామ్నాయంగా కదిలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల శరీరం రిలాక్సేషన్‌ మోడ్‌లోకి వెళ్తుంది.. మెదడులో ఆలోచనలు తగ్గి త్వరగా నిద్రలోకి జారుకుంటారు అంటున్నారు నిపుణులు.

సంగీతం: బటర్‌ఫ్లై ట్యాపింగ్‌ టెక్నిక్‌ మంచి రిజల్ట్ ను అందించినా ఇది అందరి విషయంలో వర్కౌట్ కాదట. ఒత్తిడికి గురైతే నిద్ర పట్టడం చాలా కష్టం.. నిద్రకు సరైన షెడ్యూల్‌ లేకపోవడం, నాణ్యమైన నిద్ర కరవవడంతో కొన్ని సందర్భాల్లో ఇది ఇన్సోమ్నియా (నిద్రలేమి)కి దారి తీస్తుంది అంటున్నారు నిపుణులు. అందువల్ల ఈ టెక్నిక్‌లో రిథమిటిక్‌ వైబ్రేషన్లతో శరీరం రిలాక్స్‌ మోడ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మానవులు రోజులో కనీసం 7 నుంచి 8గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి.

మంచి నిద్ర కోసం అవసరమైతే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దీని వల్ల మీకు దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు రావు.. ఈ టెక్నిక్‌ను ట్రై చేయడం వల్ల ఎలాంటి హానికరం ఉండదు.. కాకపోతే మీలో ఒత్తిడికి గల కారణాలను తెలుసుకొని పరిష్కరించుకోవడమే ఉత్తమం. అలాగే, నిద్రపోయేముందు మీకు ఇష్టమైన సంగీతం వినడం వల్ల మనసు కూల్ గా హాయిగా అవుతుంది. తద్వారా మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. పడుకునే ముందు మనసుకు హాయిగా ఉండే వాతావరణాన్ని మాత్రమే ఉంచుకోవాలి. గందరగోళాన్ని సృష్టించే విధంగా, గజిబిజీగా ఉండకూడదు. ముఖ్యంగా గోడల మీద పోస్టర్లు, పెయింటింగ్ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిదే

కొన్ని పద్ధతులు
పడుకునే ముందు చదవడం, వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి పడుకునే ముందు చేయడం వల్ల మెదడు ఆలోచనలను మానేసి హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. ఇవి మనస్సు, శరీరం రెండింటినీ విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి.

ఫోన్లు వద్దు
రాత్రిపూట స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి. వీలైతే బెడ్ రూమ్ లో వాటిని ఉంచవద్దు. పడుకునేకంటే కనీసం ఒక గంట ముందు వీటిని దూరం పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించి మంచి నిద్రను దూరం చేస్తుంది. మెలటోనిన్ అనేది నిద్రను నియంత్రించే హార్మోన్. అందుకే రాత్రి పడుకునే ముందు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు.