Homeహెల్త్‌Sleeping Problem: నిద్ర సరిగా పోవడం లేదా.. అయితే మీకు ఆ ప్రమాదం తప్పదు?

Sleeping Problem: నిద్ర సరిగా పోవడం లేదా.. అయితే మీకు ఆ ప్రమాదం తప్పదు?

Sleeping Problem: స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక.. చాలా మందికి నిద్ర కరువైంది. ఇప్పటికే ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, సమస్యల కారణంగా అనేక మంది నిద్రకు దూరమవుతున్నారు. జీవన విధానంలో మార్పు కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇందులో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మరింత సమస్యగా మారింది. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూస్తూ ఆలస్యంగా నిద్రపోతున్నారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు అలవాటుపడి రాత్రంతా మేల్కొనే ఉంటున్నారు. సరిగా నిద్రపోవడం లేదు. దీంతో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

షుగర్‌ ముప్పు..
శరీరానికి, మెదడుకు విశ్రాంతినిచ్చే నిద్ర మనిషికి ఎంతో అవసరం. రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం అని వైద్యులు చెబుతున్నారు. కనీసం 5 గంటలు అయినా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొంత మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఉద్యోగంలో, కుటంబంలో వచ్చే ఒడిడుకులు, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం నిద్రలేమికి ప్రధాన కారణాంగా చెప్పవచ్చు. సరైన నిద్రలేకపోతే డయాబెటిస్‌ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరిశోధనలో గుర్తింపు..
స్వీడన్‌లోని ఉప్ప్సల యూనివర్సిటీవారు జరిపిన అధ్యయనం ప్రకారం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వారికి టైప్‌2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే యూనివర్సిటీ ఇదివరకు జరిపిన అధ్యయనాల ప్రకారం ఆహారపు నియమాలు పాటించని వారికి షుగర్‌ వచ్చే అవకాశం ఎక్కువ అని నిరూపించారు. కొత్త అధ్యయనం ‘ప్రకారం సరైన డైట్‌ పాటించని వారితోపాటు సరైన నిద్రపోకపోతే భవిష్యత్‌లో షుగర్‌ వ్యాధి తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఇలా రక్షణ..
ప్రపంచంలో డయాబెటిస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో 46.2 కోట్ల మంది టైప్‌2 డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోవడంతో నియంత్రణ కష్టంగా మారింది. జన్యుపరంగా వ్యాధిబారిన పడేవారు కొందరు అయితే జీవన విధానాలతో వ్యాధికి లోనైనవారు కొందరు. జన్యుపరమైన వ్యాధిని నియంత్రించలేం. కానీ, ఆహారపు అలవాట్లు, నిద్ర ద్వారా వచ్చే షుగర్‌ నియంత్రణ మన చేతుల్లోనే ఉందని వైద్యులు సూచిస్తున్నారు. లైఫ్‌స్టైల్‌లో మార్పులతో ముప్పు తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. మంచి ఆహారం, కంటినిండా నిద్రతో షుగర్‌ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version