Teenage Girl Problems: ఆడపిల్లలకు రజస్వల ప్రధాన లక్షణం. దీనికి కనీస వయసు ఉండేది. గతంలో 13 సంవత్సరాల తరువాత వచ్చే దశ ప్రస్తుతం ఓ రెండు సంవత్సరాలు ముందుకు రావడంతో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న వయసులోనే ఆ ప్రభావానికి గురికావడంతో జీవితాంతం దాని బాధలు పడుతున్నారు. శరీరంలోని అవయవాలు ఎదగకుండానే వారు వయసుకు రావడంతో వారికి చిన్న వయసు నుంచే ఆరోగ్య బాధలు పెరుగుతున్నాయి. నెల నెల హార్మోన్ ల ప్రభావంతో వచ్చే రుగ్మతలతో సతమతమవుతున్నారు.
ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇదే తీరుగా ఆడపిల్లలు వయసుకు రావడం చూస్తున్నాం. దీంతో వారు బాలుర కంటే ముందే వయసుకు రావడంతో వారిలో సమస్యలు వస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల ప్రభావంతో శరీరాల్లో వస్తున్న మార్పులకు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నారు. దీంతో బాలికల్లో అధిక బరువు పరోక్షంగా ఆ మార్పులు సంభవించేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
పూర్వం రోజుల్లో బాలికలు 16 ఏళ్ల వరకు కానీ వయసుకు వచ్చే వారు కాదు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా అలాంటి వెసులుబాటు ఉండేది. కాలక్రమంలో మన ఆహార అలవాట్లు విపరీతం కావడంతో ఆడవారి వయసు కూడా ముందుకు జరగడం తెలిసిందే. దీంతో చిన్న వయసులోనే రజస్వల అయి నిత్యం ఎన్నో ప్రయాసలు పడుతున్నసంగతి తెలిసిందే. దీంతో వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?
అమెరికా లాంటి దేశాల్లో టెస్టోస్టిరాన్, ఈస్రోజన్ హార్మోన్లు ఎక్కువగా వాడుతున్నందున అనేక అనర్థాలు వస్తున్నాయి. మాంసారం ఎక్కువగా తింటున్నందున 75 శాతం మంది పిల్లలు తొందరగా యౌవనానికి వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో యుక్త వయసు మార్పులను వేగవంతం చేస్తున్నట్లు శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనం సాధారణంగా వాడే ప్లాస్టిక్ వస్తువులు, రసాయన పదార్థాలు కూడా హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నందున బాలికలకు సమస్యలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
తొందరగా యవ్వనంలోకి అడుగు పెడుతున్న బాలికలకు పలు కోణాల్లో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా వారి జీవన గమనం ఆటుపోట్లకు గురవుతన్నట్లు తెలుస్తోంది. అండాశయ, గర్భసంచి, రొమ్ము క్యాన్సర్ వంటి రోగాలు చుట్టుముడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, వ్యాధుల నుంచి రక్షణ, ఆహారం, విశ్రాంతి వంటి వాటిపై ఆడపిల్లలకు అవగాహన ఉండాలి. ఆడపిల్లలు పౌష్టికాహారం తీసుకుని శారీరక వ్యాయామం చేయాల్సిన అవసరం గుర్తించాలి.
Also Read: ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఒక్క గ్లాస్ వేడి నీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?