Astrology: మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఈరోజు అంతా మంచే జరగాలని అనుకుంటూ వెళ్తాం. ఇలాంటి సమయంలో మనకు రోడ్డుమీద డబ్బు లేదా నగలు కనిపిస్తాయి. కొందరు వీటిని కనిపించగానే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పజెప్తారు. మరికొందరు మాత్రం లక్ష్మీదేవి తమకు లభించిందని భావించి ఇంట్లోకి తీసుకువస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి వస్తువులను ఇంటికి తీసుకురావడం మంచిదేనా? అన్న సందేహం కొందరికి లభిస్తుంది. సాధారణంగా డబ్బు లేదా నగలు దొరికితే కచ్చితంగా వాటిని ఇంటికి తీసుకువస్తారు. కానీ అలా తీసుకురావడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయంటే?
డబ్బు:
సాధారణంగా డబ్బు కనిపించగానే ఎవరైనా తీసుకొని కళ్ళకు అద్దుకొని జేబులో వేసుకుంటారు. అది ఒక రూపాయి కావచ్చు లేదా లక్షల రూపాయలు కావచ్చు. అయితే ఈ డబ్బు లక్ష్మీదేవికి ప్రతిరూపం కావచ్చు. కానీ ఒకరి కష్టార్జితం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి తన శక్తిని ధారపోసి డబ్బులు సంపాదించి ఉంటాడు. అలాంటి డబ్బు అనుకోకుండా లేదా దొంగతనం వల్ల పోగొట్టుకొని ఉంటాడు. అతని జీవితం ప్రకారం అతడు నష్టపోవచ్చు. కానీ అతని కష్టం, ఆవేదన అంతా ఈ డబ్బుపై ఉంటుంది. అలాంటి డబ్బు ఇంటికి తీసుకురావడం వల్ల ఆ డబ్బు పై ఉన్న వ్యక్తి ప్రభావం తీసుకున్న వారిపై పడుతుందని అంటుంటారు. ఆ ప్రభావం మంచిది కావచ్చు.. లేదా చెడ్డది కావచ్చు.. ఏదైనా డబ్బుపై ఉన్న వ్యక్తి ప్రభావం మాత్రం మరొకరికి ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంటుంది. దీనిని బట్టి రోడ్డుపై దొరికిన డబ్బు తీసుకోవచ్చా? లేదా? అనేది ఆలోచించుకోవాలి.
బంగారం:
బంగారం లక్ష్మికి ప్రతిరూపం. ప్రస్తుత సమయంలో బంగారంకు ఉన్న విలువ ఏ లోహానికి లేదు. చిన్నపాటి బంగారపు ముక్క దొరికితే ఎవరూ వదలరు. అలాంటిది కొంతవరకు బంగారం దొరికితే అసలు విడిచిపెట్టరు. కానీ డబ్బు కంటే బంగారంపై ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక వ్యక్తిలోని క్రోధం ,మొహం, ఈర్ష్యా వంటి గుణాలు బంగారంపై పడతాయి. అయితే అలాంటి బంగారంను దొరికితే తీసుకురావడం వల్ల మరో వ్యక్తిపై తప్పనిసరిగా పడుతుంది. దీంతో ఒక వ్యక్తి నుంచి ఈ గుణాలు మరో వ్యక్తికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ లక్ష్మికి ప్రతిరూపంగా భావించే బంగారం దొరికితే ఎవరు విడిచిపెట్టరు. సందర్భాన్ని బట్టి ఆ బంగారం ను తీసుకోవచ్చా? లేదా? అనేది వారే నిర్ణయించుకోవాలి.
తాళాలు:
ఒక వ్యక్తి వస్తువులు లేదా డబ్బు లేదా నగలు దాచుకొని దానికి సంబంధించిన తాళాలు లేదా ఇంటికి సంబంధించిన తాళాలు దొరకగానే కొంతమంది సంతోషపడతారు. కానీ వాస్తవానికి వీటిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఎన్నో నష్టాలను చవి చూడాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన రహస్యాన్ని మరొక వ్యక్తి దొంగిలించిన వారే అవుతారు. ఆ వ్యక్తి ఎంతో నమ్మకంగా భద్రంగా దాచుకున్న వస్తువులకు వేసిన తాళం ఇతరులు తీసుకోవడం వల్ల ఆ వ్యక్తిపై ఉన్న ప్రభావం మరో వ్యక్తికి వెళ్లే అవకాశం ఉంటుంది.