
మనలో చాలామంది టీ అంటే ఎంతో ఇష్టపడతారు. సాధారణంగా టీ అంటే తియ్యగా ఉంటుంది. అయితే వేపాకుతో తయారు చేసిన టీ మాత్రం చేదుగానే ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే వేపాకు టీ తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడంలో వేపాకు టీ సహాయపడుతుంది. వేపాకు టీ మంచి పోషకాలు ఉన్న హెర్బల్ టీ అని చెప్పవచ్చు.
వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే జబ్బుల బారిన పడకుండా చేయడంలో వేపాకు టీ సహాయపడుతుంది. జుట్టు, చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు వేపాకు టీని తాగితే మంచిది. వేపాకు టీని తయారు చేసుకోవాలంటే వేపాకులు పది, బెల్లం లేదా చక్కెర, నీళ్లు కావాలి. వేపాకు టీని తయారు చేసుకోవాలంటే వేపాకులను మంచినీళ్లలో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత నీళ్లను గిన్నెలో పోసి వేపాకులను శుభ్రంగా మరిగించాలి.
నీళ్లు లైట్ గ్రీన్ కలర్ లోకి వచ్చిన తరువాత స్టవ్ ఆపి బెల్లం లేదా చక్కెర కలిపి తాగాలి. టీ చేదుగా ఉంటుంది కాబట్టి టీ చల్లారక ముందే తాగితే మంచిది. వేపాకు టీ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వేప వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేప నూనెతో ముఖంపై ఉంటే మొటిమలను సులభంగా పోగొట్టుకోవచ్చు. జుట్టులో ఉండే చుండ్రును పోగొట్టడంలో వేపాకు రసం సహాయపడుతుంది.
కురులు పెరగటానికి, కురులు బలంగా ఉండేందుకు, చర్మ సౌందర్యానికి వేపనూనె ఉపయోగపడుతుంది. చర్మంపై ఉండే ఇరిటేషన్, చర్మం ఎర్రబడిపోవటం లాంటి సమస్యలకు వేప నూనెతో చెక్ పెట్టవచ్చు.