Hair Health: భారతీయుల వంట గదిలో పసుపు మాత్రం పక్కా ఉండాల్సిందే. ఇది లేని వంటిల్లు ఉండదు. ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో అవసరం ఈ పసుపు. మొటిమల నుంచి టాన్ వరకు వేలాది చర్మ సమస్యలను తొలగించడంలో సహాయం చేస్తుంది. ఇక ఎప్పుడైనా మీరు జుట్టు సంరక్షణలో ఈ పసుపును ఉపయోగించారా? అయితే ఓ సారి దీని వినియోగం తెలుసుకొని వాడండి.
పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయనే విషయం తెలిసిందే. జుట్టు రాలడం, దురద, చుండ్రు వంటి సమస్యలు తగ్గిస్తుంది పసుపు. తలపై యాంటీ ఫంగల్ పదార్థంగా ఉపయోగపడుతుంది. ఇది ఫంగస్ తో పోరాడి, చుండ్రును దూరం చేస్తుంది. మరి జుట్టు కోసం దీన్ని ఎలా వినియోగించాలో కూడా తెలుసుకుందాం. రోజువారి షాంపూలో 1 టీస్పూన్ పసుపు పొడిని కలపుకోండి. దీనిని స్కాల్ప్ ను శుభ్రం చేసుకునేలా వాడాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు దూరం అవడమే కాదు జుట్టు వేగంగా పెరుగుతుంది.
1/4 కప్పు కొబ్బరి నూనెలో 1 టీస్పూన్ పసుపు పొడిని కలిపి షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు తలకు రాయాలి. జుట్టుకు మొత్తం పట్టించి మసాజ్ చేస్తూ ఉండాలి. దీని వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. ఇక జుట్టుకు పసుపు తో మాస్క్ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు పుల్లని పెరుగులో 2 స్పూన్ల ఆలివ్ నూనె, 2 స్పూన్ల పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని జుట్టుకు, తలకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచండి.
30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్య రెండూ దూరం అవుతాయి. 1 కప్పు నీటికి 1 టీస్పూన్ పసుపు కలిపుకోవాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత పసుపు నీరును జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత మరో సారి సాధారణ నీటితో మళ్లీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల చుండ్రు సమస్య మాయం అవుతుంది.