Blood Donation Misconceptions: మనమందరం మన జీవితంలో ఏదో ఒకటి దానం చేస్తాము. అవసరమైన వారికి దానం చేయడం చాలా ముఖ్యం. కానీ అతి పెద్ద దానం రక్తదానంగా చెబుతుంటారు. మీరు దానం చేసిన రక్తం నుంచి చాలా మంది కొత్త జీవితాన్ని పొందుతారు. అందువల్ల రక్తదానాన్ని గొప్ప దానంగా పరిగణిస్తారు. ప్రతి యూనిట్ రక్తం ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడుతుంది. కానీ నేటికీ ప్రజలకు దాని గురించి అవగాహన లేదు. నేటికీ, దీని గురించి ప్రజల మనస్సులలో అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మెయిన్ గా రక్తదానం చేయడం వల్ల ఉండే అపోహలు ఏంటో తెలుసుకుందాం.
దానం చేసిన రక్తం ప్రాణాలను ఎలా కాపాడుతుంది?
దానం చేసిన రక్తంలో ఒక్క కణం కూడా వృధా కాదట. ఇది ఎర్ర రక్త కణాలు , ప్లాస్మా. ప్లేట్‌లెట్‌లుగా వేరు అవుతుంది. వీటిని వివిధ వైద్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. స్ట్రోక్ బాధితులు, క్యాన్సర్ రోగులు, పెరియోపరేటివ్ వ్యక్తులు, దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో రక్తదానాలు అవసరం. అందువల్ల, రక్తదానం అనేది ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదు. నైతిక, సామాజిక బాధ్యత కూడా. అయినప్పటికీ, దీనికి సంబంధించిన కొన్ని అపోహలు ఇప్పటికీ ప్రజలు రక్తదానం చేయకుండా నిరోధిస్తాయి. రక్తదానానికి సంబంధించిన సాధారణ అపోహలు, వాటి గురించి తెలుసుకుందాం.
అపోహ 1- రక్తదానం చేయడం వల్ల బలహీనంగా మారతారు?
వాస్తవం- రక్తంలోని ద్రవ భాగాలు 24 గంటల్లో భర్తీ అవుతాయి. ఎర్ర రక్త కణాలు భర్తీ కావడానికి కొన్ని వారాలు పడుతుంది. పురుషులు మూడు నెలలకు ఒకసారి మహిళలు నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు అంటున్నారు నిపుణులు.
అపోహ 2- రక్తదానం చేసే ప్రక్రియ చాలా బాధాకరమైనది. సమయం తీసుకుంటుంది.
వాస్తవం: రక్తాన్ని సేకరించడానికి 8-10 నిమిషాలు పడుతుంది. రక్తదానం చేయడానికి మొత్తం ప్రక్రియ కేవలం 30 ని.లు పడుతుంది. చాలా మంది దాతలు దీనిని నొప్పిలేకుండా, సంతృప్తికరంగా భావిస్తారు.
అపోహ 3- మీ రక్త వర్గం అరుదుగా ఉంటేనే మీరు రక్తదానం చేయాలి.
వాస్తవం- ప్రతి రక్త గ్రూపు సమానంగా ముఖ్యమైనది. ప్రసూతి సంరక్షణ నుంచి శస్త్రచికిత్సలు, గాయాల వరకు, సాధారణ రక్త గ్రూపులకు ప్రతిరోజూ అధిక డిమాండ్ ఉంటుంది. ఈ రోజు మీ రక్తం రేపు ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు.
అపోహ 5- వృద్ధులు లేదా సన్నగా ఉన్నవారు రక్తదానం చేయకూడదు.
వాస్తవం- 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండి ఆరోగ్యంతో ఉంటే మీరు రక్తం ఇవ్వచ్చు. అంతేకాదు కనీస బరువు, హిమోగ్లోబిన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, మీరు రక్తదానం చేయవచ్చు. ప్రతి దానానికి ముందు మీ అర్హతను అంచనా వేస్తారు.
రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
రక్తదానం చేయడం వల్ల శరీరంలోని అదనపు ఇనుమును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. రక్తదానం చేయడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. ప్రతి రక్తదానం దాదాపు 600-650 కేలరీలు ఖర్చవుతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా రక్త వ్యవస్థ చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.