Moringa Leaves Benefits: మల్టీవిటమిన్లు, మల్టీమినరల్స్, యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్ కలిగి ఉన్న ఒక గ్రీన్ పౌడర్ ఉంటే ఎంత బాగుండు కదా. కానీ నిజంగానే మీ ఇంటి ముందు, లేదా మీ ఇంటి వెనుక, పక్కనే ఇది ఉంది అని మీకు తెలుసా? అదేనండీ మునగ చెట్టు. ఈ చెట్టు చాలా మంది ఇంటి వద్ద ఉంటుంది. ఇక ఆ ఆకుల పౌడర్ ను తీసుకుంటే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. మరి దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందామా.
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ ఆకు కూర మన ఇండియాలోనే ఉండటం నిజంగా గర్వాకారణం కదా. అవును అదే మునగ ఆకు కూర. ఇక ఎన్నో దేశాలకు ఈ పొడి ఎగుమతి అవుతుంటుంది. మన దేశం నుంచి ఈ పొడిని కొనడానికి ఏకంగా కిలో రూ. 2000లు ఖర్చు చేస్తుంటారు. ఇందులోని విటమిన్ సి, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయం చేస్తాయి. అంతేకాదు గుండె సమస్యల నుంచి క్యాన్సర్ ల వరకు చాలా సమస్యలను నయం చేసే గుణం ఈ మునగ పొడికి ఉంది. డయాబెటీస్ పేషెంట్ల షుగర్ లెవల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. చర్మం నిగారింపులో, జుట్టు రక్షణలో కూడా సహాయ పడుతుంది ఈ మునగ. అంతేకాదు దీని వల్ల మీరు మీ వయసు కంటే 5 సంవత్సరాలు తక్కువ కనిపిస్తారు కూడా.
మీరు రక్తహీనత లేదా రక్త లోపంతో బాధపడుతుంటే, మునగ పొడి మీకు ఒక వరం లాంటిది. మునగ ఒక అద్భుతమైన సహజ ఇనుము వనరు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇనుము హిమోగ్లోబిన్ ముఖ్యమైన అంశం. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి పనిచేస్తుంది. అంతేకాదు మునగ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము శోషణ మెరుగుపడుతుంది. ఇది సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అలసట, బలహీనతను తొలగించడమే కాకుండా, మీ శరీరాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. ముఖ్యంగా ఇనుము లోపంతో బాధపడే మహిళలు, పిల్లలకు, మునగ ఒక గేమ్ ఛేంజర్ లా ఉంటుంది.
Also Read: సంతూర్, మైసూర్ శాండల్ వాడితే మీ పని ఖతమే.. అసలు ఏ సోప్ వాడాలో తెలుసా?
ఉదయం నిద్ర లేవగానే అలసిపోయినట్లు అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం లేదా ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం… ఇవన్నీ శక్తి లేకపోవడానికి సంకేతాలు కావచ్చు. కానీ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మునగ పొడి మీ శక్తి స్థాయిలను ఆకాశాన్ని అంటుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఈ మునగలో విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ శరీర జీవక్రియ ప్రక్రియలో పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి బాధ్యత వహిస్తుంది. మీ జీవక్రియ సరిగ్గా పనిచేసినప్పుడు, మీరు రోజంతా మరింత చురుకుగా, దృష్టి కేంద్రీకరించి, శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు.
ఈ మునగలో విటమిన్లు ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది రెటీనాను ఆరోగ్యంగా ఉంచడంలో, రాత్రి దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.