Modi Yoga Speech Vizag: విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ( world yoga day) వేడుకలు అంబరాన్ని తాకాయి. విజయవంతంగా పూర్తయ్యాయి. ఒకేసారి మూడు లక్షల మందికి పైగా యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. గత 45 రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమైంది యంత్రాంగం. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేశారు ప్రధాని మోదీ. నాడే తాను విశాఖలో జరిగే యోగా దినోత్సవ వేడుకలకు హాజరవుతానని ప్రకటించారు. అది మొదలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారని కొనియాడారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం యోగాంధ్రాను అద్భుతంగా నిర్వహించిందని చెప్పుకొచ్చారు మోది. అయితే ఈ కార్యక్రమం నిర్వహణలో లోకేష్ పాత్రను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
“Yoga is pause button that humanity needs to breath and balance to become whole again.”
– PM Modi in Visakhapatnam pic.twitter.com/CTIW0GqlLS
— News Arena India (@NewsArenaIndia) June 21, 2025
ప్రత్యేకంగా లోకేష్ ప్రస్తావన..
యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) కీలక ప్రసంగం చేశారు. యోగా విశ్వవ్యాప్తం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకుంది విశాఖలోని ఈ దినోత్సవం. గతంలో సూరత్ లో 1.47 లక్షలు మందితో యోగా దినోత్సవం జరిగింది. కానీ ఈరోజు మాత్రం మూడు లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. దీనికి ముగ్గురు అయ్యారు ప్రధాని మోదీ. యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి? సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలి? వీటన్నింటి పైన గడిచిన నెల రోజులుగా శ్రమించిన లోకేష్ ను అభినందించారు. ఇటువంటి సామాజిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఒక నమూనాగా చూపించారని నారా లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. యోగాంధ్ర పై అన్ని వర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని.. కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.
Also Read: Nara Lokesh : లోకేష్ కు ఊహించని ప్రమోషన్.. మంచి సమయం అంటున్న తమ్ముళ్లు!
ప్రధాని విన్నపం మేరకు..
అమరావతి రాజధాని( Amaravathi capital ) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చారు ప్రధాని మోదీ. ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలో అప్పుడు ప్రధాని మోదీ లోకేష్ కు ప్రత్యేకంగా అభినందించారు. ఢిల్లీ వచ్చి తనను కలవాలని కోరారు. దీంతో లోకేష్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. స్వయంగా ప్రధానితో విందు చేశారు. ఆ సమయంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన చాలా అంశాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. ప్రపంచ యోగా దినోత్సవానికి హాజరుకావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. యోగా విశ్వవ్యాప్తం చేయడానికి అనుసరించాల్సిన అంశాలను చర్చించారు. ఆ సందర్భంలో కూడా లోకేష్ చొరవను చూసి ముగ్ధుడయ్యారు ప్రధాని మోదీ. గత కొద్దిరోజులుగా యోగా దినోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ విషయాన్ని తెలుసుకొని ప్రధాని తాజాగా అభినందించినట్లు తెలుస్తోంది.
Also Read: Lokesh Delhi Tour Highlight: ఏపీకి ఆ దేశ మాజీ ప్రధాని సాయం.. లోకేష్ చొరవ!
నేరుగా ఢిల్లీ నుంచి విశాఖకు..
వాస్తవానికి నారా లోకేష్ ( Nara Lokesh)నేరుగా ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకున్నారు. అంతకుముందు మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలో పర్యటించారు. క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుసుకొని ఏపీ పరిస్థితులను, పెండింగ్ ప్రాజెక్టులను వారి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవ ఏర్పాట్లను ఢిల్లీ నుంచి పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం నేరుగా విశాఖకు చేరుకొని రాత్రి వరకు ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రధాని మోదీ ఈరోజు యోగా దినోత్సవ వేదిక నుంచి లోకేష్ ను అభినందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Andhra Pradesh CM Chandrababu Naidu calls for Yoga’s inclusion in global sports. pic.twitter.com/wd2OAHFLs4
— News Arena India (@NewsArenaIndia) June 21, 2025