https://oktelugu.com/

Gram Ujala Yojana:  మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.50కే మూడేళ్ల వారంటీతో ఐదు బల్బులు!

Gram Ujala Yojana:  పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో గ్రామ్ ఉజాలా పథకం కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాలలో వెలుగులు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ అమలులో భాగంగా కేంద్రం 10 రూపాయలకే ఎల్ఈడీ బల్బులను అందజేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 50 లక్షలకు పైగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2021 / 10:56 AM IST
    Follow us on

    Gram Ujala Yojana:  పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో గ్రామ్ ఉజాలా పథకం కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాలలో వెలుగులు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ అమలులో భాగంగా కేంద్రం 10 రూపాయలకే ఎల్ఈడీ బల్బులను అందజేస్తున్న సంగతి తెలిసిందే.

    Gram Ujala Yojana

    కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 50 లక్షలకు పైగా ఎల్ఈడీ బల్బులను అందజేసింది. కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనే ప్రభుత్వ కంపెనీ ఈ విషయాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో భాగంగా కేవలం 10 రూపాయలకే ఎల్.ఈ.డీ బల్బుల పంపిణీ జరగనుంది.

    Also Read:  మోహన్ బాబుకు రాజభవనాన్ని తలపించే ఇల్లు.. మంచు లక్ష్మీ వీడియో వైరల్!

    కేంద్ర ప్రభుత్వం ఈ బల్బులను 7 వాట్స్, 12 వాట్స్ తో 10 రూపాయలకు మూడు సంవత్సరాల గ్యారంటీతో అందిస్తోంది. ప్రతి కుటుంబానికి కేంద్రం 5 బల్బులను పంపిణీ చేయనుండటం గమనార్హం. ఎల్.ఈ.డీ బల్బుల ద్వారా కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను ఆదా చేస్తోంది. 2022 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎల్.ఈ.డీ బల్బుల వల్ల కరెంట్ బిల్లులు కూడా తక్కువ మొత్తంలో వస్తున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా 71 కోట్ల కంటే ఎక్కువ మొత్తం విద్యుత్ ను పొదుపు చేస్తుండటం గమనార్హం. మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

    Also Read: మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?