AP Politics: కాపులను మోసం చేస్తుందెవరు.. ట్రెండింగ్ లో ఇద్దరు నేతలు?

AP Politics:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం సాధించాలన్న కాపుల కల కలగానే మిగిలిపోయింది.  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాపులు బలమైన శక్తిగా మారిపోయారు. ప్రభుత్వాలను మార్చగలిగే ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా కాపు ఓటు బ్యాంకుపై కన్నేశాయి. ఇందులో భాగంగా కాపు నేతలకు తాయిళాలు ప్రకటిస్తూ తమవెంట ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది పదవుల ఆశతో జగన్, చంద్రబాబు పంచన చేరి ద్వితీయశ్రేణి నేతలుగా మారి అధికార […]

Written By: NARESH, Updated On : January 1, 2022 9:25 am
Follow us on

AP Politics:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం సాధించాలన్న కాపుల కల కలగానే మిగిలిపోయింది.  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాపులు బలమైన శక్తిగా మారిపోయారు. ప్రభుత్వాలను మార్చగలిగే ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా కాపు ఓటు బ్యాంకుపై కన్నేశాయి. ఇందులో భాగంగా కాపు నేతలకు తాయిళాలు ప్రకటిస్తూ తమవెంట ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది పదవుల ఆశతో జగన్, చంద్రబాబు పంచన చేరి ద్వితీయశ్రేణి నేతలుగా మారి అధికార దర్పాన్ని అనుభవిస్తున్నారు.

 

mudragad vangaveeti

తొలి నుంచి కాపు సామాజిక వర్గం టీడీపీకి అండగా ఉండేది. కాపు రిజర్వేషన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చపోవడంతో వారంతా గత ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గుచూపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ దాన్ని ఉత్సవ విగ్రహంగా మార్చి నిధులు, విధులు లేకుండా చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇక దీన్ని అందిపుచ్చుకున్న వైసీపీ సంవత్సరానికి 2వేల కోట్లు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటన చేసింది. అలా కాపుల ఓట్లు కొల్లగొట్టి అధికారం సాధించింది. అయితే ఈరోజు వరకూ కూడా ఒక్కరూపాయి ఇవ్వకుండా మోసం చేసింది.. వీటికి సరైన నిధులు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో మళ్లీ కాపులు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read: అమరావతి పేరు మీద అప్పు కోసం జగన్ ప్రయత్నాలు?

మరోవైపు జనసేన పార్టీకి కూడా కాపు సామాజికవర్గం అండగా నిలుస్తోంది. అయితే కాపులంతా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల వారీగా చీలిపోతుండటంతో కాపుల రాజ్యాధికారం నినాదం నినాదంగానే మిగిలిపోతోంది. అయితే ఇటీవలీ కాలంలో కాపులంతా పార్టీలకతీతంగా ఏకమై కాపు రిజర్వేషన్, రాజ్యాధికారం కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా కాపులకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు టీడీపీ, వైసీపీలకు కోవర్టులుగా మారి మరోసారి తమ సామాజికవర్గాన్ని మోసం చేసేందుకు రెడీ అయ్యారని పలువురు సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారే కాపుల సెంటిమెంట్ ను రగిలిస్తున్నారని అంటున్నారు. కొందరు ముద్రగడ పేరును.. మరికొందరు వంగవీటి రాధా పేరును సోషల్ మీడియాలో కోవర్టులుగా అభివర్ణిస్తూ ఆరోపిస్తున్నారు.

ముద్రగడ పద్మనాభం మరోసారి టీడీపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు వైసీపీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఓ వర్గం వారు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.  కాపు ఓట్లను జగన్ కు మళ్లించేలా ముద్రగడ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారని టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఉద్యమకారులు ట్రోల్ చేస్తున్నారు. కొత్త పార్టీ పేరుతో కాపు ఓట్లను చీల్చి జగన్ కు లబ్ధి చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.

ఇక వంగవీటి రాధా గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. తన హత్యకు రెక్కీ జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనపై రెక్కీ ఎవరో నిర్వహించారో మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో ఆయనకు వ్యాఖ్యలు రాజకీయ వ్యూహాంలో భాగంగా చేసినవనే కామెంట్స్ వస్తున్నాయి. కాపు ఓట్లను టీడీపీకి మళ్లించే వ్యూహంలో భాగంగానే రాధా ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

వీరిద్దరు కూడా టీడీపీ, వైసీపీలకు కోవర్టుగా మారి కాపులను మోసం చేసేందుకు రెడీ అయ్యారని పలువురు సోషల్ మీడియాల్లో ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు నేతల ఎత్తుగడలతో ఆటలో అరటిపండుగా మిగిలిపోయారనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఈ విషయంలో కాపులంతా అప్రమత్తంగా లేకుంటే మాత్రం మరోసారి మోసపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:  మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?