Millets Benfits: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలలో కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే సిరిధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యలలో చాలా సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సిరి ధాన్యాలను తీసుకోవచ్చు.
రక్తంలో గ్లూకోజ్ ను తగ్గించడంలో సిరిధాన్యాలు తోడ్పడతాయి. సిరి ధాన్యాలలో ఉండే పీచు శరీరానికి మేలు చేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యలు, షుగర్ తో బాధ పడేవాళ్లు సిరి ధాన్యాలు తినడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అసిడిటీతో బాధ పడేవాళ్లకు సిరిధాన్యాల వల్ల మేలు జరుగుతుంది. సిరి ధాన్యాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
సిరిధాన్యాలలో గోయిట్రోజెనిక్ పాలీఫెనాల్స్, ఫైటిక్ యాసిడ్, యాంటీ న్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, బజ్రా, బుక్వీట్, కొర్రలు, ఇతర సిరిధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.