https://oktelugu.com/

Zodiac Signs: 2022 లో ఏ రాశి వారి ప్రేమ జాతకం ఎలా ఉందో తెలుసా?

Zodiac Signs: మరి కొద్ది రోజులలో 2021 వ సంవత్సరం వెళ్ళిపోతూ 2022 వ సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాము. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఎన్నో సంఘటనలు జరిగిన, ఎన్నో చేదు అనుభవాలు జరిగిన వచ్చే ఏడాది మన జీవితం ప్రశాంతంగా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే 2022 వ సంవత్సరంలో ప్రతి ఒక్కరు వారి రాశి ఏ విధంగా ఉందనే విషయం గురించి తెలుసుకోవాలనే ఆత్రుత ఉంటుంది.మరి ఈ సంవత్సరం ఏ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2021 / 12:37 PM IST
    Follow us on

    Zodiac Signs: మరి కొద్ది రోజులలో 2021 వ సంవత్సరం వెళ్ళిపోతూ 2022 వ సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాము. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఎన్నో సంఘటనలు జరిగిన, ఎన్నో చేదు అనుభవాలు జరిగిన వచ్చే ఏడాది మన జీవితం ప్రశాంతంగా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే 2022 వ సంవత్సరంలో ప్రతి ఒక్కరు వారి రాశి ఏ విధంగా ఉందనే విషయం గురించి తెలుసుకోవాలనే ఆత్రుత ఉంటుంది.మరి ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం…

    మేషం: మేష రాశి వారికి వచ్చే ఏడాది ప్రేమ విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనలో ఉన్నారు అందులో విజయం సాధిస్తారు.

    వృషభం: ఈ రాశి వారికి ఈ ఏడాది ఎంతో ప్రేమానురాగాలు అందుతాయి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.

    మిధునం: ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమ పెరగటంతో ఇద్దరు కలిసి ఎంతో కష్టమైన సమస్యలు కూడా వెంటనే పరిష్కరిస్తారు. ఒంటరిగా ఉన్న ఈ రాశివారు ఈ ఏడాది వారి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు.

    కర్కాటకం: ఈ రాశి వారికి వారి జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది మధ్యలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మీ జీవిత భాగస్వామితో ఉండే సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి.

    సింహం: ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వల్ల మీ బంధం బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. ఇక అవివాహితులకు ఈ ఏడాది వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

    కన్య: ఈ రాశి వారికి ఏడాది మొదట్లో తన జీవిత భాగస్వామితో కొంత వ్యతిరేకత ఏర్పడి మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి పూర్తి నిరాశే ఎదురవుతుంది.

    తుల: ఈ రాశి వారికి కొత్త ఏడాది వారి జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ఏడాది ఎంతో అనుకూలమైనది.

    వృశ్చికం: ఈ రాశి వారికి ఈ ఏడాది మొదట్లో ఎంతో అనుకూలంగా ఉండటమే కాకుండా జీవితభాగస్వామితో ఎంతో ప్రేమానురాగాలను పెంచుకుంటారు. అయితే ఈ ఏడాది మధ్యలో ఇద్దరి మధ్య తీవ్రమైన కలహాలు ఏర్పడతాయి. ఇది మీకు సవాలుగా మారి మీ సంబంధాన్ని బలహీనపరిచే అవకాశాలు ఉంటాయి.

    ధనస్సు: ఈ రాశి వారికి వచ్చే ఏడాది ప్రేమ విషయంలో కొంత ప్రతికూలత ఏర్పడి వీరి మధ్య ఉన్న బంధం బలహీనంగా మారుతుంది. కనుక ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

    మకరం: ఈ రాశి వారికి ప్రేమ విషయంలో ఏడాది మొదట్లో కొన్ని సమస్యలు ఉన్నా ఆ తర్వాత సమస్యలు పరిష్కారం ఒకరిపై మరొకరు ప్రేమానురాగాలను పెంచుకుంటారు.

    కుంభరాశి: కుంభ రాశి వారికి ఏడాది మొదట్లో ప్రేమ విషయంలో కాస్త గందరగోళంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంతవరకు కోపం తగ్గించుకోవడం మంచిది అలాగే ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

    మీనం: ఈ రాశివారు వచ్చే ఏడాది మీ జీవితభాగస్వామితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి.పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలలో ఇతరులకు అవకాశం ఇవ్వడం వల్ల మీ మధ్య మనస్పర్థలు పెరుగుతాయి.