Corona Remedies : ఈ కరోనా రాకతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతుంది. మానవజాతికి ప్రశాంతత కరువైంది. రెండేళ్లుగా ఈ మహమ్మారి మనుషులను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే, వరల్డ్ వైడ్ గా లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కోల్పోతూనే ఉన్నారు. వైద్య శాస్త్రం ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు యుద్ధం చేయాల్సి వస్తోంది. ఎంత కృషి చేస్తున్నా… కరోనా తన రూపం మార్చుకుంటూ సవాల్ విసురుతూనే ఉంది. తాజాగా వచ్చిన ఒమిక్రాన్ ముచ్చెమటలు పట్టిస్తూనే ఉంది.
మరి ఈ థర్డ్ వేవ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ఏకైక పరిష్కారం మిమ్మల్ని మీరు మాత్రమే రక్షించుకోవడమే.
ప్రతి ఒక్కరూ దయచేసి ఈ కింద మార్గాలను సలహాలను గమనించి పాటించండి.
దయచేసి మీ కడుపులను ఖాళీగా ఉంచకండి. అలాగే ఉపవాసం చేయవద్దు. రోజూ ఒక గంట సూర్యరశ్మిని ఆస్వాదించండి. ఏసీ ఉపయోగించవద్దు.
ఇక వెచ్చని నీరు త్రాగండి, గొంతు తడిగా ఉంచండి. ముక్కుకు ఆవ నూనె రాయండి. ఇంట్లో హారతి కర్పూరం కాల్చండి.
ప్రతి కూరగాయకు అర టీస్పూన్ పొడి అల్లం జోడించండి. దాల్చినచెక్క వాడండి, రాత్రి కప్పు పాలతో ఒక స్పూన్ పసుపు త్రాగాలి. పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వీలైతే ఒక చెంచా చ్యవన్ ప్రాష తినండి. ఇంటిలో కర్పూరం మరియు లవంగాలతో పొగ వేయండి.
ఉదయం టీలో లవంగం వేసి మరిగించి తాగండి. పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినండి.
మీరు కరోనాను ఓడించాలనుకుంటే, దయచేసి పైవన్నీ పాటించండి.