Korean Mango Milk: మార్చిలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండే ఎండతో మాడు పగలగొడుతున్నాడు. ఏదైనా పని మీద బయటకు వెళ్లి ఇంటికి వస్తే చాలు నీరసం ఆవహిస్తోంది. ఒంటినిండా చెమట పడుతోంది. ఇలాంటప్పుడు ఏం కాదని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ క్రమంలో ఒంటికి సత్వర శక్తి ఇచ్చే పానీయం కావాలి. అలాంటి పానీయాలలో ముందు వరుసలో ఉండేది కొరియన్ మ్యాంగో మిల్క్ రెసిపీ. వాస్తవానికి ఇప్పుడు మ్యాంగో (మామిడి పండ్లు) సీజన్ కాకపోయినప్పటికీ.. సూపర్ మార్కెట్లో మామిడి పండ్లు లభిస్తూనే ఉన్నాయి. అలా లభించినప్పుడు కొన్ని మామిడి పండ్లను తీసుకొచ్చి ఫ్రిజ్లో పడేస్తే చాలాకాలం నిల్వ ఉంటాయి. మ్యాంగో మిల్క్ కంటే కొరియన్ మ్యాంగో మిల్క్ షేక్ విభిన్నమైన రుచి కలిగి ఉంటుంది. పైగా ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి అవి సత్వర శక్తిని అందిస్తాయి. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేయాలంటే..
ముందుగా పండిన మామిడికాయను తీసుకొని.. దానిని శుభ్రంగా కడగాలి. అనంతరం అందులో ఉన్న గుజ్జును తీసి మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పడితే రసం బయటకు వస్తుంది. ఆ రసంలో ఐసు ముక్కలు, పాలను కలపాలి. తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీలో పట్టాలి. అనంతరం మామిడి రసం, పాలు, ఐస్ మిశ్రమంలో సగ్గుబియ్యం మిక్స్ కలపాలి. ఇలా చేస్తే సూపర్ క్రిమి, స్మూత్ టెక్స్టర్ వస్తుంది. అయితే ఇందులో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు డయాబెటిక్ ఉన్నవారు వైద్యుల సలహాల మేరకు తీసుకోవాలి. అలా తయారుచేసిన కొరియన్ మ్యాంగో మిల్క్ షేక్ ను ఫ్రిజ్ లో ఉంచి.. దానిపై కొన్ని డ్రైఫ్రూట్స్ వేసుకొని తాగితే భలే టేస్ట్ ఉంటుంది.
ఎండాకాలంలో నీరసంగా ఉన్నప్పుడు ఈ మిల్క్ షేక్ తాగితే ఉపయుక్తంగా ఉంటుంది. శరీరం సత్వరమే రీఛార్జ్ అవుతుంది. దీనివల్ల పోయిన లవణాలను తిరిగి శరీరం పెంపొందించుకుంటుంది.. జీర్ణ క్రియను పెంపొందిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. మిల్క్ షేక్ లో ఉన్న ఫ్రక్టోజ్ సత్వరంగా శక్తిని ఇస్తుంది. అయితే ఈ మిల్క్ షేక్ ను డయాబెటిక్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహాల మేరకు తీసుకుంటే బాగుంటుంది.