https://oktelugu.com/

Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

Lemon Juice: మహిళలలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తీసుకుంటే రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. గర్భధారణ సమయంలో కాళ్ళలో వాపును తగ్గించడంలో నిమ్మకాయ నీళ్లు తోడ్పడతాయని చెప్పవచ్చు. నిమ్మరసం పుట్టబోయే బిడ్డకు ఎంతగానో మేలు చేస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ పెరుగుదలకు నిమ్మరసం ఎంతగానో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 28, 2022 / 05:05 PM IST
    Follow us on

    Lemon Juice: మహిళలలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తీసుకుంటే రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. గర్భధారణ సమయంలో కాళ్ళలో వాపును తగ్గించడంలో నిమ్మకాయ నీళ్లు తోడ్పడతాయని చెప్పవచ్చు.

    Lemon Juice

    నిమ్మరసం పుట్టబోయే బిడ్డకు ఎంతగానో మేలు చేస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ పెరుగుదలకు నిమ్మరసం ఎంతగానో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల వాపు సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. నిమ్మకాయ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరచడంతో పాటు శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: Kodali Nani: మంత్రి కొడాలి నాని స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

    నిమ్మరసం తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రకోప ప్రేగు కదలికలను నియంత్రించడంలో నిమ్మరసం ఉపయోగపడుతుంది. వికారం, వాంతులు, గ్యాస్ సమస్యలకు నిమ్మరసంతో చెక్ పెట్టవచ్చు. నిమ్మరసం సి విటమిన్ ను కలిగి ఉండటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందిస్తుంది. నిమ్మకాయ ద్వారా శరీరానికి అవసరమైన సి విటమిన్ లభించే అవకాశం ఉంటుంది.

    నిమ్మరసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తీసుకోవడం విషయంలో ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మహిళలు ఆ ప్రచారాన్ని అస్సలు నమ్మకుండా నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

    Also Read: 40 Years For TDP: టీడీపీ @40 ఇయ‌ర్స్‌.. త‌మ్ముళ్ల ఆవేద‌న ప‌ట్టించుకోండ‌య్యా చంద్ర‌బాబు..