Homeహెల్త్‌Kids Eating Bakery Products Harmful Effects: పిల్లలకు ఇష్టమని తినిపిస్తున్నారా.. ఇవి అస్సలు మంచివి...

Kids Eating Bakery Products Harmful Effects: పిల్లలకు ఇష్టమని తినిపిస్తున్నారా.. ఇవి అస్సలు మంచివి కావు

Kids Eating Bakery Products Harmful Effects: సాధారణంగా పిల్లలు చిరుతిండ్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా బేకరీ ఉత్పత్తులను లాగించేస్తుంటారు. బేకరీ ఉత్పత్తుల్లో మైదాపిండి ఎక్కువగా వాడుతుంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్ నెస్ కలిగించే పదార్థాలను.. క్రీమ్.. చక్కెర.. కృత్రిమ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ఆ ఉత్పత్తులు చూసేందుకు అత్యంత ఆకర్షణయంగా కనిపిస్తుంటాయి. చూసేందుకు బాగున్నాయని తింటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.

చిన్నపిల్లలు ఎక్కువగా బేకరీ ఉత్పత్తులను తినేందుకు ఇష్టపడుతుంటారు. గత కొంతకాలంగా క్రీమ్ బిస్కెట్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. రకరకాల పేర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. చూసేందుకు బాగున్నాయని తింటే మాత్రం ప్రమాదాలు తప్పవని వైద్యు హెచ్చరిస్తున్నారు. వీటి తయారీలో అధికంగా చక్కెర, మైదా, కృత్రిమ పదార్థాలు వాడతారు. వీటివల్ల శరీరంలో చెడు కొవ్వులు పెరిగిపోతాయి. ఫలితంగా గుండె, జీర్ణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువగా తీసుకుంటే.. వారి ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది.

క్రీమ్ బిస్కెట్లలో హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ల అసమతౌల్యానికి దారి తీస్తాయి. అందువల్ల పిల్లల ఎదుగుదలలో తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతేకాదు, రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడంతో వివిధ రకాలైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల క్రీం బిస్కెట్లు.. మైదా ఉత్పత్తులకు పిల్లలను దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. బేకరీ ఉత్పత్తులను తీసుకోవడం అనివార్యమైతే.. మోతాదులో తినిపించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇటీవల కాలంలో చేసిన పరిశోధనల వల్ల బేకరీ ఉత్పత్తులు పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తున్నాయని తేలింది. అందువల్ల వాటిని దూరంగా ఉంచడమే మంచిదని నిపుణుల పరిశోధనలలో తేలింది. అందువల్ల ఆ తరహా ఉత్పత్తులకు పిల్లలను దూరంగా ఉంచాలి.. ఈ ఉత్పత్తుల స్థానంలో తాజా పండ్లు, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం పిల్లలకు తినిపించాలి.. వాటి వల్ల పిల్లలకు సరైన స్థాయిలో విటమిన్స్.. ఇతర పోషకాలు అందుతాయి. ఫలితంగా పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది.

గమనిక

ఈ కథనం వివిధ వేదికలలో సేకరించిన సమాచారాన్ని పాఠకులకు అందించాం. వైద్యుల సలహాల మేరకు పాఠకులు నడుచుకోవాలి. ఈ కథనం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version