Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh : గూగుల్ నుంచి.. క్వాంటం వ్యాలీ దాకా.. ఏపీ మీద నారా లోకేష్...

Nara Lokesh : గూగుల్ నుంచి.. క్వాంటం వ్యాలీ దాకా.. ఏపీ మీద నారా లోకేష్ ముద్ర

Nara Lokesh : రాజధాని లేదు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. 2019 నుంచి 2024 దాకా రాష్ట్రంలో రాక్షసకాండ సాగింది. రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన నాటి పాలకుల దుర్నీతి వల్ల ఏపీ రాష్ట్రం బాగు చేయలేని రీతిలో భ్రష్టు పట్టిపోయింది. ఫలితంగా ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు లేకుండా పోయాయి. ఉన్న కంపెనీలు వెళ్లిపోయాయి. ఆదాయం వచ్చే మార్గం లేదు. సమకూరే ఆదాయం దేనికి సరిపోయే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని లాగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్రం నుంచి నిధులను తెప్పించుకున్నది. కేంద్రంలో కీలక భాగస్వామిగా అవతరించింది. అగ్నికి వాయువు తోడైనట్టు.. చంద్రబాబు దార్శనికతకు.. లోకేష్ వేగం తోడైంది. ఫలితంగా ఏపీ రాష్ట్రం దేశ స్థాయిని దాటి.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందింది. మనదేశంలో ప్రఖ్యాత గూగుల్ సంస్థకు డేటా సెంటర్ కు భూములు కేటాయించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో నిర్మితం కాబోతోంది. ఐటీ పరంగా విశాఖపట్నంలో కార్యకలాపాలు వేగిరమయ్యాయి.

ఒకప్పుడు విశాఖపట్నం క్రికెట్ స్టేడియం లో అంతర్జాతీయ మ్యాచ్ జరగడమే గగనంగా మారిపోయేది. అటువంటిది విశాఖపట్నంలో వరుసగా అంతర్జాతీయ మ్యాచులు జరిగాయి. మిథాలీ రాజ్ వంటి వారు విశాఖపట్నం వచ్చి.. లోకేష్ చేస్తున్న గొప్ప పనులను అభినందించారు. అంతేకాదు మహిళ క్రికెటర్లతో నారా లోకేష్ క్రీడా పాలసీ గురించి చర్చించడం కాకలు తీరిన రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి ఐసీసీ అధ్యక్షుడు జై షా తో అనేక సందర్భాల్లో సమావేశమైన నారా లోకేష్.. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఏపీలో యువతకు క్రీడలపరంగా సదుపాయాలు కల్పించేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు.

అభివృద్ధి కోణంలోనే కాకుండా.. తన శాఖ పరిధిలో జరుగుతున్న తప్పులను కూడా ఒప్పుకున్నారు నారా లోకేష్. ఇటీవల తన నియోజకవర్గం పరిధిలో ఓ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సక్రమంగా పెట్టకపోవడంతో అక్కడి విద్యార్థులు ఆందోళన చేశారు. ఇది కాస్త మీడియాలో ప్రసారమైంది. వెంటనే నారా లోకేష్ అక్కడికి వెళ్లారు. అధికారుల మీద ఆగ్రహాన్ని ఏమాత్రం వ్యక్తం చేయలేదు. క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించారు. వాటిని సవరించుకోవడానికి మార్గాలను అన్వేషించారు. తన శాఖలో జరుగుతున్న తప్పులను ఒప్పుకున్నారు. ఇకపై అలాంటిది జరగదని స్పష్టం చేశారు. తన శాఖలో తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు.

రాజకీయంగా పరిపక్వత.. అభివృద్ధి కోణంలో ముందుచూపు.. ప్రజల విషయంలో దార్శనికత.. ఇవన్నీ కూడా నారా లోకేష్ ను సరి కొత్తగా చూపిస్తున్నాయి. గిట్టని వాళ్లు ఆయనను రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న వ్యక్తి అని ఆరోపిస్తారు. నచ్చినవాళ్లు ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని కితాబిస్తారు. నారా లోకేష్ విమర్శను తట్టుకుంటారు. ప్రశంసలు స్వీకరిస్తారు. అలాగని తన పనిని మాత్రం వదిలిపెట్టరు.. తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని ఘనంగా స్వీకరించిన ఆయన.. అదే పనితీరు కొనసాగిస్తున్నారు. అందువల్లే చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మారిపోయారు.

ఇటీవల ఏపీలో క్వాంటం వ్యాలీ ఏర్పాటులో కూడా లోకేష్ కీలకపాత్ర పోషించారు. అంతకుముందు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో కూడా ఆయన విశేషంగా కృషి చేశారు. ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా.. కార్పొరేట్ కంపెనీలకు ఆలవాలంగా మార్చడానికి నారా లోకేష్ తాపత్ర పడుతున్నారు. తనకు మాత్రమే సాధ్యమైన చాకచక్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేష్.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. దటీజ్ నారా లోకేష్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version