Banana : ఈ ఒక్క పండు తింటే చాలు మీ ఒత్తిడి అంతా బలాదూర్

Banana : ఇటీవల కాలంలో ఒత్తిడి సాధారణంగా మారిపోయింది. చిన్న విషయాలనే పెద్దవిగా భావించుకుని వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సమస్య చూస్తే చిన్నదే అయినా తట్టుకోలేకపోతున్నారు. ఒత్తిడి అనేది జంతువులకు కూడా కనిపించదు. కానీ మనుషులు మాత్రం ఊరికే ఏదో జరిగిపోతున్నట్లు ఊహించుకుంటూ భవిష్యత్ ను గురించి బెంగ పడుతున్నారు. చిన్నపాటి విషయాలపైనే పెద్దగా ఫోకస్ పెట్టి జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. ఏ జంతువు కూడా ఆత్మహత్య చేసుకోదు ఒక మనిషి తప్ప. మనిషికే […]

Written By: Srinivas, Updated On : March 29, 2023 9:31 am
Follow us on

Banana : ఇటీవల కాలంలో ఒత్తిడి సాధారణంగా మారిపోయింది. చిన్న విషయాలనే పెద్దవిగా భావించుకుని వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సమస్య చూస్తే చిన్నదే అయినా తట్టుకోలేకపోతున్నారు. ఒత్తిడి అనేది జంతువులకు కూడా కనిపించదు. కానీ మనుషులు మాత్రం ఊరికే ఏదో జరిగిపోతున్నట్లు ఊహించుకుంటూ భవిష్యత్ ను గురించి బెంగ పడుతున్నారు. చిన్నపాటి విషయాలపైనే పెద్దగా ఫోకస్ పెట్టి జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. ఏ జంతువు కూడా ఆత్మహత్య చేసుకోదు ఒక మనిషి తప్ప. మనిషికే విచక్షణ ఉన్నా ఒత్తిడితోనే తనువులు చాలిస్తున్నారు.

ఒత్తిడిని దూరం చేయడంలో..

మనకు ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేయడానికి ఏది సహాయపడుతుంది? బాగా పండిన అరటి పండులో ట్రిప్టోఫాస్ ఉంటుంది. దీంతో ఇది ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని నిరోధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దోహదపడుతుంది. అనేక రకాల వ్యాధులను దూరం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కణాలు దెబ్బతినకుండా నిత్యం మనకు సాయపడుతుంది.

కొవ్వును తగ్గించడంలో..

బాగా పండిన అరటిపండు గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. చెడు కొవ్వు పెరగకుండా చేస్తుంది. దీంతో మన శరీరం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటంలో అరటిపండు మంచి పాత్ర పోషిస్తుంది. మాగిన పండు స్టార్చ్ ఫ్రీ షుగర్ గా మారుతుంది. దీంతో తిన్న వెంటనే జీర్ణమవుతుంది. దీని వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. ఎసిడిటి సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే అరటిపండు తినడం వల్ల ఇన్ని రకాల లాభాలున్నాయి.

క్యాన్సర్ నిరోధంలో..

క్యాన్సర్, ఇతర కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. కండరాల నొప్పి, తిమ్మిర్లు రాకుండా చేస్తుంది. అధిక మొత్తంలో తినకూడదు. పరిమితంగా వీటిని తీసుకోవాలి. రెండుకంటే ఎక్కువ తీసుకోవడం సురక్షితం కాదు. ఇన్ని రకాల లాభాలున్నందున మగ్గిన అరటిపండు తినడం మంచిదే. దీంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అరటిపండ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని తినడం ఎంతో ఉపయోగకరం. ఈ నేపథ్యంలో మాగిన అరటిపండును తిని మన రోగాలను దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags