Health Tips : వందల కొద్ది క్యాలరీలు మాత్రమే కాదు అదనంగా రోగాలు కూడా.. జంక్ ఫుడ్ ఎంత ప్రమాదకరమంటే..

సాధారణంగా జంక్ ఫుడ్ అంటే సమోసాలు, ఫిజ్జా, బర్గర్లే కాదు.. కార్న్ డెక్స్ ట్రినీ కూడా జంక్ ఫుడ్డే. దీని తయారీలో థిక్ నర్ అనే రసాయనం వినియోగిస్తారు. దీనిని వివిధ వస్తువులు అతికించేందుకు ఉపయోగించే గమ్ తయారీలో కూడా వాడుతుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 28, 2024 4:03 pm
Follow us on

Health Tips :  ఆలస్యం అమృతం విషం అంటారు కదా.. జంక్ ఫుడ్ విషయంలో ఈ సామెతను “విషం విషం విషం”.. అని మార్చి చదువుకోవాల్సి ఉంటుంది. మనలో చాలామందికి జంక్ ఫుడ్ తినడం అంటే విపరీతమైన ఇష్టం. దానివల్ల శక్తి రాదని తెలుసు. ఒంట్లోకి క్యాలరీలు వెళ్తాయని కూడా తెలుసు. కానీ అలాంటి ఫుడ్ తినకుండా ఉండలేరు. జంక్ ఫుడ్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఫుడ్ కనిపించగానే ఆ ఒట్టును తీసి గట్టుమీద పెట్టి.. పొట్టనిండా లాగించేస్తుంటారు. ఆలు చిప్స్, ఆలూ ఫ్రైస్, కేక్స్, నూడిల్స్, పిజ్జా, బర్గర్, సమోసా, నగేట్స్, పాస్తా.. వంటివి కనిపించగానే రెండవ మాటకు తావు లేకుండా అవలీలగా.. అత్యంత ఆబగా తినేస్తుంటారు. వాస్తవానికి అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిసి కూడా నాలుకను కట్టేసుకోలేరు. ఈ పరిస్థితి కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలాంటి జంక్ ఫుడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉబకాయం అనేది పెరిగిపోతుంది. జంక్ ఫుడ్ అదే పనిగా తినడం వల్ల యువతుల్లో పాలిసిస్టిక్ ఓవరియాన్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తాయట.. దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలు రజస్వల అవుతారు.

రసాయనాలు వాడుతున్నారు

సాధారణంగా జంక్ ఫుడ్ అంటే సమోసాలు, ఫిజ్జా, బర్గర్లే కాదు.. కార్న్ డెక్స్ ట్రినీ కూడా జంక్ ఫుడ్డే. దీని తయారీలో థిక్ నర్ అనే రసాయనం వినియోగిస్తారు. దీనిని వివిధ వస్తువులు అతికించేందుకు ఉపయోగించే గమ్ తయారీలో కూడా వాడుతుంటారు.

ఇక మనలో చాలామంది లొట్టలు వేసుకొని తాగే మిల్క్ షేక్ లలో సుమారు 50కి పైగా రసాయనాలు కలుపుతుంటారు. అయితే అవన్నీ కూడా ఒక బకెట్ పెయింట్ తో సమానమని ఇటీవలి ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు ఈ రసాయనాలు పురుషుల్లో లైంగిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉందట. అదేపనిగా మిల్క్ షేక్ తాగితే శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట. ఇక వీధులలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నూడిల్స్, ఇతర పదార్థాలు తినేవారు.. ప్రతి ఏడాది 12 వెంట్రుకలు కూడా తినేస్తున్నారట.. పైగా స్ట్రీట్ సెంటర్లలో నూడిల్స్ తయారు చేసేవారు ఏమాత్రం జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తినేవారి ఆరోగ్యం పాడవుతోందట. మనలో చాలామందికి డోనట్స్ తినడం చాలా ఇష్టం. అయితే ఒక సింగిల్ డోనట్ తింటే శరీరానికి రోజు మొత్తానికి కావలసిన ట్రాన్స్ ఫ్యాట్ లభిస్తుంది. సాండ్విచ్ బ్రెడ్ లలో అజోడీ కార్బన్మయిడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుందట. అయితే ఈ రసాయనాన్ని యోగా మ్యాట్ లు తయారు చేసేందుకు ఇంతకుమునుపు వాడే వారు.

ఒక ఐస్ క్రీమ్లో 670 క్యాలరీలు ఉంటాయి. బర్గర్ తింటే 550 క్యాలరీలు లభిస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ లో 450 క్యాలరీలు దాగి ఉంటాయి. రెగ్యులర్ ఫిజ్జా లో 260 క్యాలరీలు, చికెన్ లెగ్ పీస్ లో 120 క్యాలరీలు, డోనట్ లో 300 క్యాలరీలు ఉంటాయి. అయితే ఇవేవీ ఆరోగ్యానికి అంత మంచివి కావని అనేక రకాల అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇక ప్రతిరోజు 8 శాతం మంది ప్రజలు జంక్ ఫుడ్ తింటూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నవారే. వారంలో ఐదు సార్లకు మించి ఫుడ్ తింటున్న పిల్లలు 38% దాకా ఉన్నారు.