https://oktelugu.com/

స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?

స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ముంబైలో ఈ బ్యాంక్ యొక్క సంస్థ ఉండగా ఐటీ స్పెషలిస్ట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2021 / 12:22 PM IST
    Follow us on

    స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ముంబైలో ఈ బ్యాంక్ యొక్క సంస్థ ఉండగా ఐటీ స్పెషలిస్ట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్‌ లీడ్, జే2ఈఈ టెక్నికల్‌ లీడ్, డెవొప్స్‌ లీడ్, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్, టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలతో ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫుల్ స్టాక్, జే2ఈఈ బ్యాక్‌ఎండ్, డెవొప్స్, మేనేజ్‌మెంట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

    బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్, ఎంసీఏ/తత్సమాన ఉత్తీర్ణత, ఐటీ రంగాలలో అనుభవంతో పాటు తగిన నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. recruitment@sidbi.inj ఈ మెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముంబై అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

    ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 8 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://www.sidbi.in/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం నవంబర్ 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.