Homeఎంటర్టైన్మెంట్OTT: ఓటీటీల్లో సీక్వెల్స్​తో రానున్న వెబ్​సిరీస్​లు ఇవే!

OTT: ఓటీటీల్లో సీక్వెల్స్​తో రానున్న వెబ్​సిరీస్​లు ఇవే!

OTT: కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడిపోవడం వల్ల సినీ ప్రియులంతా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. గత సంవత్సర కాలంలో ఓటీటీల హవా జోరుగా నడుస్తోందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు వెబ్​సిరీస్​లకూ మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో, దర్శక నిర్మాతలు సినిమాలు, వెబ్​సిరీస్​లకు సీక్వెల్స్​ ప్లాన్​ చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనేే త్వరలో పలు ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ వేదికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న వెబ్​సిరీస్​లపై ఓ లుక్కేద్దాం.

ఇటీవల కాలంలో ఓటీటీలో అత్యధిక జనాధరణ పొందిన వెబ్​సిరీస్​ల్లో అసుర్​- వెల్కమ్​ టు యువర్​ డార్క్ సైడ్​ ఒకటి. క్రైమ్​ థ్రిల్లర్​ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్​ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ సిరీస్​ రెండో సీజన్​ను త్వరలో  విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు వూట్​ సంస్థ ప్రకటించింది.

మరోవైపు, సోనీలైవ్​లో విడుదలైన స్కామ్​ 1992 ఎంత పెద్ద సక్సెస్​ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోరుతోనే మరో వెబ్​సిరీస్​ను తెరకెక్కిస్తున్నట్లు అప్లాజ్​ ఎంటర్​టైన్మెంట్​ సంస్థ ప్రకటించింది. నకిలీ స్టాంప్‌ పేపర్లతో కోట్లు గడించిన అబ్దుల్‌ కరీమ్‌ తెల్గీ కేసుపై ఈ సిరీస్‌ వస్తోన్నట్లు పేర్కొంది.

Scam 1992 Telugu Trailer | The Harshad Mehta Story | Scam 1992 Web Series Trailer in Telugu |

స్పై, యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో 2020లో వచ్చి హిట్​ కొట్టిన వెబ్​సిరీస్​ల్లో స్పెషల్​ ఆప్స్​ ఒకటి. ‘రా’ ఏజెంట్‌గా హిమ్మత్‌ సింగ్‌ ( కే.కే. మీనన్‌ ) తన టీమ్‌తో ఎలాంటి ఆపరేషన్స్‌ చేశాడనేదే కథ. అయితే, ఇందుకు సీక్వెల్​గా హిమ్మత్‌ సింగ్‌ ‘రా’ ఏజెంట్‌గా జాయిన్‌ అయిన తొలినాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లు, హనీ ట్రాప్‌ కథాంశంగా స్పెషల్‌ ఆప్స్‌ 1.5 రాబోతోంది. నవంబరు 12న హాట్​స్టార్​లో విడుదల కానుంది.

క్రికెట్​ స్టోరీ బ్యాక్​డ్రాప్​లో వచ్చిన ఇన్​సైడ్​ ఎడ్స్​ వెబ్​సిరీస్​ ప్రేక్షకుల మనసును కట్టిపడేశాయి. ఇప్పటికే ఈ సిరీస్​ నుంచి రెండు సీజన్​లు విడుదలయ్యాయి. కాగా, ఇప్పుడు మరో సీక్వెల్​ను తెరపైకి తీసురానున్నట్లు అమెజాన్​ ప్రైమ్​ ట్విట్టర్​ వేదికగా తెలిపింది. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.

Inside Edge Season 2 - Official Trailer 2019 | Amazon Original

బాలీవుడ్​ నటి సుష్మితా సేన్​ ప్రధాన పాత్రలో నటించి హిట్​ కొట్టి సిరీస్​ ఆర్య. క్రైమ్ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్​ను రామ్‌ మాధవానీ, సందీప్‌ మోడీ, వినోద్‌ రావత్‌ దర్శకత్వం వహించారు. తాజాగా, ఈ సిరీస్​కు సీక్వెల్​ రానున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్‌ తెలిపింది. వీటితో పాటు, షీ- సీజన్‌ 2(నెట్‌ఫ్లిక్స్‌), మసబా.. మసబా.. సీజన్‌ 2(నెట్‌ఫ్లిక్స్‌), మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2(అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో), ఢిల్లీ క్రైమ్‌ 2(నెట్‌ఫ్లిక్స్‌), జమ్తారా సీజన్ 2(నెట్‌ఫ్లిక్స్‌) సిరీస్​లు కూడా సీక్వెల్స్​ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version