https://oktelugu.com/

జీమెయిల్ ఖాతా ఉన్నవాళ్లకు అలర్ట్.. లాగిన్ కావాలంటే ఇలా చేయాల్సిందే?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలకు జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి. రోజురోజుకు సైబర్ మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి టెక్ కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకుంటూ ఉండటం గమనార్హం. జీమెయిల్ యూజర్లు ఇకపై ఖాతాల్లోకి లాగిన్ కావాలని భావిస్తే రెండు దశల ధృవీకరణను తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో గూగుల్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. నవంబర్ నెల 9వ తేదీ నుంచి యూజర్లు తమ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2021 12:17 pm
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలకు జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి. రోజురోజుకు సైబర్ మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి టెక్ కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకుంటూ ఉండటం గమనార్హం. జీమెయిల్ యూజర్లు ఇకపై ఖాతాల్లోకి లాగిన్ కావాలని భావిస్తే రెండు దశల ధృవీకరణను తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో గూగుల్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.

    నవంబర్ నెల 9వ తేదీ నుంచి యూజర్లు తమ అకౌంట్ లోకి లాగిన్ కావాలంటే తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. 2021 సంవత్సరం చివరినాటికి 150 మిలియన్ గూగుల్ యూజర్లు, 2 మిలియన్ల యూట్యూబ్ యూజర్లు ఈ ఫీచర్ ను తప్పనిసరిగా వినియోగించాలని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే ఎక్కువమంది యూజర్లు టూ స్టెప్ వెరిఫికేషన్ ను వాడుతున్నారు.

    సైబర్ నేరగాళ్ల నుంచి యూజర్ ఖాతాలకు రక్షణ కల్పించడానికి ఉపయోగపడే రక్షణ కవచంగా ఇది ఉపయోగపడుతుందని సమాచారం. టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్ యొక్క ఫోన్ లేదా ఈ మెయిల్ కు ఓటీపీ వచ్చే అవకాశం ఉంటుంది. యూజర్లు ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా ఈ ఫీచర్ యాక్టివేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

    జీమెయిల్ ఐడీతో గూగుల్ ద్వారా లాగిన తర్వాత కుడివైపున పేరు లేదా ఫోటో ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి అందులో సెట్టింగ్స్ ను ఓపెన్ చేసి సెక్యూరిటీ ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా టూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఆఫ్ అని కనిపిస్తుంటే ఆ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.