Wake Up: మనం ఉదయం లేవగానే ఏం చేయాలి? ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది? అనే విషయాలపై అందరికి ఆసక్తి ఉండటం సహజమే. చాలా మంది లేవగానే టీ తాగి కాలకృత్యాలు తీర్చుకోవడం చేస్తుంటారు. కానీ అలా కాదు. నిద్ర నుంచి మేల్కొనగానే మనం ఓ పని చేస్తే మనకు ఎంతో మంచి జరుగుతుంది. సనాతన సంప్రదాయంలో మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు. నిద్ర లేచిన వెంటనే మనం చేసే పని ఒకటి ఉంది. అది చేయడం ద్వారా మనకు ఎంతో మేలు కలుగుతుంది. సకల శుభాలు పలకరిస్తాయి. సంపదలు కలిసొస్తాయి.

నిద్ర లేస్తూనే..
ఉదయం నిద్ర లేవగానే మన రెండు చేతులను చూసుకోవాలి. వాటిని మన ముఖానికి అద్దుకుని మరోసారి చూసుకోవాలి. మన అర చేతిలో లక్ష్మీదేవి ఉంటుంది. మధ్య భాగంలో సరస్వతీ దేవి కొలువుంటుంది. చేతి వేళ్ల చివర్లో వేంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇలా మన అరచేతిలోనే అందరు దేవుళ్లు ఉంటారనే నమ్మకంతో ఉదయం లేవగానే చేతులను చూసుకుని వాటితో ముఖాన్ని రుద్దుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని విశ్వాసం. ఉదయం లేస్తూనే వేటిని చూడొద్దు. నేరుగా చేతులనే చూసుకోవాలి.
రోజంతా హుషారు
ఉదయం చేతులను చూసుకోగానే మనకు మంచి జ్ణానం సిద్ధిస్తుందని చెబుతారు. డబ్బు నిలవడానికి కూడా దోహదపడుతుంది. సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయి. చేతులను రుద్దడం వల్ల ఉష్ణం కలుగుతుంది. ఆ వేడి ముఖానికి తగిలి మనం రోజంతా హుషారుగా ఉండేందుకు కారణమవుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. బద్ధకం లేకుండా పోతుంది. దేవుళ్ల ఆశీర్వచనాలు కూడా మనపై ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం అరచేతులను చూసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు దక్కుతాయి.

ఈ మంత్రం జపిస్తే..
చేతులను కళ్లకు అద్దుకుంటూ రుద్దుకుని ఒక మంత్రం జపిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. కరాగ్రే వసలే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవంద: ప్రభాతే కరదర్శనం అంటూ మంత్రం చదివితే మనకు ఇంకా మంచి జరుగుతుంది. మనం ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం ద్వారా ఇంకా చాలా మంచి లాభాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే సూర్యోదయం తరువాత నిద్ర లేస్తే సకల రోగాలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఉదయం నిద్ర లేచి మనకు మంచి కలిగేందుకు కావాల్సిన పరిస్థితులను కల్పించుకోవడానికి అందరు రెడీ ఉండటం శుభ పరిణామమే కదా.