Lupus symptoms in Women: వాతావరణ కాలుష్యం.. ఆహారపు అలవాట్లు కారణంగా కొత్త కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇందులోనూ రైన్ సీజన్ కావడంతో సీజనల్ వ్యాధులు కూడా తోడు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి వ్యాధి అయినా కొన్ని లక్షలాలను ముందే గుర్తిస్తే వాటికి ట్రీట్మెంట్ ఈజీ అవుతుందని చెబుతున్నారు. అలాంటి వాటిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని అంటున్నారు. ఇంతకీ ఎలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించాలి?
రోజంతా అలసటగా ఉండడం.. బలహీనంగా అనిపించడం.. కారణం లేకుండానే తరచూ జ్వరం రావడం.. జుట్టు ఊడిపోవడం.. ఊపిరితిత్తులు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడడం.. తలనొప్పులు.. డిప్రెషన్ కు గురవడం వంటి లక్షణాలు మహిళల్లో కనిపిస్తే.. వెంటనే అప్రమత్తం కావాలని అంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దానిని లూపస్ గా పేర్కొంటారు. లూపస్ అనేది ఆటో యూనియన్ వ్యాధి. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతిస్తుంది పైకి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరం లోపల ఆరోగ్య కణజాలాన్ని దెబ్బతిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు పైకి ఆరోగ్యంగానే కనిపిస్తారు.. కానీ కొన్ని లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అలా సంప్రదించని యెడల గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం చూపి దీర్ఘకాలిక సమస్యలకు కారణం అవుతున్నాయని అంటున్నారు.
లూపస్ వ్యాధి ఎక్కువగా మహిళల్లోనే వస్తుంది. అందుకు కారణం సంతానోత్పత్తి సమయంలో హార్మోన్లు ఎక్కువగా ఉండడమేనని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధి వస్తుందని తెలియడానికి మోకాళ్లు, చేతులు, భుజాలలో ఎక్కువగా నొప్పి ఏర్పడుతుందని.. శరీరంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తాయని అంటున్నారు. జున్నుపరమైన ప్రభావంతో పాటు.. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు మెడిసిన్స్ వాడినా కూడా రసాయనాల ప్రభావంతో ఈ వ్యాధి బారిన పడతారు.
లూపస్ వ్యాధిని న్యూక్లియర్ యాంటీ బాడీ, డబుల్ స్ట్రాండ్ డీఎన్ఏ, c3, సి4 ప్రోటీన్లు, యాంటీ పోస్పో లిపిడ్ వంటి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. అలాగే మూత్ర పరీక్ష, ఎక్స్రే, సిటీ స్కాన్ ద్వారా కూడా అవయవాల పరిస్థితిని తెలుసుకుంటారు. వీటిలో ఉండే లక్షణాల ఆధారంగా లూపోస్ వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ వ్యాధి నిరోధానికి పూర్తిస్థాయి చికిత్స లేదు. కానీ లక్షణాలను గుర్తించగానే చికిత్స తీసుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వ్యాధిని నిరోధించవచ్చని అంటున్నారు.
అయితే ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు కూడా తీసుకోవాలని అంటున్నారు. కంటి నిండా నిద్రపోవడం.. సమతుల్ ఆహారం తీసుకోవడం.. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కాకుండా ఉంటుంది. దీంతో లూపస్ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.