Life Tips: జీవితంలో ఎవరైనా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. కానీ ఒక్కోసారి అనుకోకుండానే బాధపడాల్సి వస్తుంది.. ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ.. కార్యాలయాల్లో బాస్ తోనో.. వ్యాపార సముదాయాల్లో యజమానితోనో మాటలు పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక్కోసారి ఈ జీవితం ఎందుకు? అన్న ఆలోచన కూడా వస్తుంది. సమాజంలో కష్టాలు లేని మనుషులే కాదు జంతువులు కూడా లేవని కొందరు చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క ప్రాణికి ఏదో రకమైన కష్టం ఎదురవుతూనే ఉంటుంది. అలా ప్రతిదానికి ముడుచుకు కూర్చుని ఉంటే జీవితం సాగదు. కానీ ఒక్కోసారి మనసు భారంగా ఉండి ఏం చేయాలో తోచదు. అయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ చిన్న పనులు చేయండి.. అలా చేస్తే మనసు భారం నుంచి తేలికగా మారుతుంది.. ఆ తర్వాత పాత విషయాలను మర్చిపోతే జీవితం కొత్తగా అవుతుంది.. మరి బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటే?
ఎవరైనా మనసు నొప్పించే మాట వినగానే బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో కూర్చుని ఏడవకుండా.. వీలైనంతవరకు బయటకు నడుస్తూ ఉండాలి. అది మార్కెట్లోకి కావచ్చు లేదా.. దగ్గర్లోని స్టోర్కు కావచ్చు.. అలా బయటకు వెళ్లి తిరిగి రావాలి. లేదా దగ్గరలో పార్కు ఉంటే అక్కడికి వెళ్లి కనీసం గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఉన్న ఒత్తిడి నుంచి బయటపడతారు.
ఇంట్లో సమస్యల కారణంగా కొన్ని రోజులపాటు బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అయితే వీరు ఒంటరి వారు అయితే.. విహార యాత్రలకు వెళ్లడం మంచిది. ఇలా విహారయాత్రలకు వెళ్లడం వల్ల మనసు తేలికగా మారుతుంది. ఆ తర్వాత సమస్యలు పెద్దగా భారంగా అనిపించవు.
సంగీతానికి ప్రాణాలు లేచి వస్తాయని కొందరి వైద్యుల నమ్మకం. ఇష్టమైన సంగీతం వింటే ఎంతటి కష్టాన్నయినా దూరం చేసుకోవచ్చు. అలాగే కార్యాలయాల్లో బాస్ తో మాటలు పడాల్సి వచ్చినప్పుడు.. వెంటనే ఆందోళన చెందకుండా ఒక అరగంట విశ్రాంతి తీసుకొని ఇష్టమైన సంగీతం వినండి. లేదా నచ్చిన కామెడీ బిట్ లేదా షార్ట్ చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఆలోచనలు మనసులోకి రావు.
ప్రతిరోజు ఉద్యోగం చేసేవారు ఏదో ఒక ఒత్తిడితోనే ఉంటారు. అయితే ఇంట్లోను కూడా ఇదే వాతావరణము ఉంటే తట్టుకోలేకపోతుంటారు. ఇలాంటి సమయంలో మనసు తేలికగా కావడానికి పిల్లలతో ఆడుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలకు నచ్చిన ఆటలను వారితో కలిసి ఆడటం వల్ల వారితో పాటు మీకు కూడా మనసు ప్రశాంతంగా మారుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ వల్ల శరీరం తేలికగా మారుతుంది.
కాస్త మనసు కష్టంగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచదు. ఒకవేళ కథను రాసి అలవాటు లేదా కవితలు రాసి అలవాటు ఉన్నవారు ఒక పేపర్ పెన్ను తీసుకుని వెంటనే ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బాధపడిన మనసు నుంచి కవితలు పుట్టుకొస్తాయి. ఇవి కూడా మందు తరాల వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇలా మనసులో ఉన్న బాధనంతా పేపర్ పెన్నుపై చూపించడం వల్ల మనసు తేలికగా మారుతుంది.