Corona Virus: దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలను సైతం సడలించారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోల్చి చూస్తే థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ పెద్దగా ప్రభావం చూపలేదు. కరోనా బారిన పడిన వాళ్లలో చాలామంది వైరస్ నుంచి వేగంగానే కోలుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం గమనార్హం.
శరీరంలోని అనేక అవయవాలపై కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కాలి వేళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. మరి కొందరిలో చర్మంపై దద్దుర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.
Also Read: ‘సన్నాఫ్ ఇండియా’ 3 రోజుల కలెక్షన్స్
మందులను వాడటం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బొల్లి, సోరియాసిస్ వ్యాధులతో బాధ పడేవాళ్లకు కరోనా సోకితే కోలుకున్న తర్వాత ఈ వ్యాధులు మరింత తీవ్రమతువున్నాయని గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మరి కొందరిని వేర్వేరు చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయని సమాచారం అందుతోంది.
రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటే సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకుంటే మంచిది. చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం ద్వారా సమస్య నుంచి వేగంగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: పూజాహెగ్డేకు సమంత కౌంటర్ అదిరిపోయిందిగా.. కోల్డ్ వార్ పీక్స్
టంగుటూరి వీరేహం బకాహం పంతులు అంటే.. ట్రోలింగ్ చెయ్యరా ?
Recommended Video: