https://oktelugu.com/

Papaya : ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినడం మంచిదేనా?

డైట్‌ ఫాలో అయ్యేవాళ్లు తప్పకుండా బొప్పాయిని తింటారు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 25, 2024 / 04:37 AM IST

    Papaya

    Follow us on

    Papaya : బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందరూ ఈ పండును ఇష్టంగా తింటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట బొప్పాయి పండును తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఇందులోని ఖనిజాలు బొప్పాయిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయిని తింటే కడుపు ఎక్కువ సమయం నిండినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల తొందరగా బరువు తగ్గుతారు. అలాగే మధుమేహం, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధికారక వ్యాధుల నుంచి బొప్పాయి కాపాడుతుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చర్మం కాంతివంతంగా మారడం, ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. డైట్‌ ఫాలో అయ్యేవాళ్లు తప్పకుండా బొప్పాయిని తింటారు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    కిడ్నీలో రాళ్ల సమస్య
    కొందరు కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు బొప్పాయి జోలికి వెళ్లకపోతేనే బెటర్ అని నిపుణులు అంటున్నారు. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇంకా అనారోగ్య సమస్యలను పెంచుతుంది. బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కాల్షియం ఆక్సలేట్ పెరిగి.. మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు బొప్పాయిని తినడం తగ్గిస్తే బెటర్.

    హైపోగ్లైసీమియా
    మధుమేహంతో బాధపడేవారికి బొప్పాయి మేలు చేసిన వీటిని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది చివరికి హైపోగ్లైసీమియాకి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. బొప్పాయి తినడం వల్ల కొన్నిసార్లు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కానీ అధికంగా తినడం వల్ల కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

    రక్తపోటు సమస్య ఉన్నవారు
    గుండె ఆరోగ్యానికి బొప్పాయి మేలు చేస్తుంది. కానీ సక్రమంగా గుండె కొట్టుకోకపోతే బొప్పాయిని తినకపోవడం మంచిది. బొప్పాయిలో సైనోజెనిక్ గ్లైకోసైడ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో హైడ్రోజన్ సైనైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల రక్తపోటు ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు కాస్త దూరంగా ఉండటం మంచిది.

    గర్భిణులు
    గర్భిణులు బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్భిణులు బొప్పాయి తినకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు కూడా అసలు బొప్పాయి జోలికి పోకూడదు. దీనిని తినడం వల్ల ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్‌లు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

    అలర్జీ ఉన్నవారు
    కొంతమంది అలెర్జీతో బాధపడుతుంటారు. అలాంటివారు బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలో ఉండే చిటినేస్ అనే ఎంజైమ్ చర్మ సంబంధిత సమస్యలు, దగ్గు, కంటి సమస్యలను పెంచుతుంది. అలాగే శ్వాస కోశ సమస్యలను పెంచుతుంది. కాబట్టి ఇలాంటి వారు బొప్పాయికి కాస్త దూరంగా ఉండాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.