Neem Comb: ఈ దువ్వెనతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా!

జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడంతో పాటు రాలిపోకుండా ఉండాలంటే వేప దువ్వెనను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేప దువ్వెనలో జుట్టును పెంచే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు స్కాల్ప్ దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.

Written By: Kusuma Aggunna, Updated On : October 24, 2024 2:53 pm

Neem Comb

Follow us on

Neem Comb: అమ్మాయిలకు అందాన్నిచ్చే వాటిలో జుట్టు చాలా ముఖ్యమైనది. కురులు అందంగా ఉంటేనే మహిళలు అంత కంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే కాలుష్యం, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన వల్ల చాలా మంది జుట్టు ఈ రోజుల్లో రాలిపోతుంది. వీటికి ముఖ్య కారణం మనం తినే ఫుడ్, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్, షాంపూ, ఆయిల్స్ వంటివి కారణం అవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని కొందరు ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. అయిన కూడా జుట్టు రాలిపోయే సమస్య మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. ఇంతకు ముందు జనరేషన్‌లో ఒక్కోరి జుట్టు పొడవుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరి జుట్టు చూస్తున్న కూడా చిన్నగానే ఉంటుంది. అందులో జుట్టు ఇంకా రాలిపోవడం ఒకటి. జుట్టు ఆరోగ్యంగా ఉంటూ బలంగా పెరగాలంటే కేవలం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే సరిపోదు. వీటిని వాడటం వల్ల జుట్టు పెరగడం ఏమో కానీ ఇంకా రాలిపోతుంది. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి మరి జుట్టు రాలే సమస్యను ఇంకా పెంచుకుంటున్నారు. జుట్టు ఒత్తుగా పెరగాలంటే వాడే ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా దువ్వెన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందరూ ప్లాస్టిక్ దువ్వెనలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి వల్ల కూడా జుట్టు రాలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జుట్టు రాలిపోకుండా ఉండకూడదంటే ఉపయోగించాల్సిన దువ్వెన ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడంతో పాటు రాలిపోకుండా ఉండాలంటే వేప దువ్వెనను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేప దువ్వెనలో జుట్టును పెంచే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు స్కాల్ప్ దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. దీంతో స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండటం వల్ల జుట్టు తొందరగా పెరుగుతుంది. వేప దువ్వెనతో తలను దువ్వుకోవడం వల్ల తలపై ఈజీగా రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరుగుతుంది. అలాగే ఎవరికైనా చుండ్రు ఉంటే వెంటనే క్లియర్ చేస్తుంది. వీటితో పాటు దురద, ఇన్ఫెక్షన్లను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది. కొందరికి జుట్టు ఎక్కువగా చిట్లిపోతుంది. అలాంటి వారు ఈ దువ్వెనను వాడటం వల్ల జుట్టు చిట్లకుండా బలంగా పెరుగుతుంది. జుట్టు చిట్లిపోతే మళ్లీ పెరగడం కష్టం. కాబట్టి ప్లాస్టిక్ దువ్వెనలు కాకుండా వేప దువ్వెన వాడటానికి ప్రయత్నించండి. ఇది మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. రోజూ ఈ దువ్వెనతో దువ్వుకుంటే జుట్టు తొందరగా బలంగా పెరుగుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.