Keeping phone in front pocket: సాధారణంగా ప్రతీ పురుషుడు మొబైల్ ను జేబులో పెట్టుకోవడం అలవాటు. మరికొందరు ల్యాప్ టాప్ ను ఒళ్లో పెట్టుకొని పనిచేయడం కన్వినెంట్ గా భావిస్తారు. అయితే ఇలా చేయడం తప్పనిసరి అయినా కొన్ని సందర్భాల్లో జేబుల నుంచి మొబైల్ తీసి అనువైన ప్రదేశంలో ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఫోన్‌ను ఎక్కువ సేపు ప్యాంట్ ఫ్రంట్ పాకెట్‌లో పెట్టుకోవడం.. అలాగే ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడటం పురుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే అంశంపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రేడియేషన్, వేడి (హీట్) ప్రభావం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా అనే విషయంపై అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. అయితే ఇవి పూర్తిగా నిర్ధారణకు రాకపోయినా, మందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తలు ఏవంటే?
మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్‌ను సాధారణంగా రేడియోఫ్రీక్వెన్సీ ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని అంటారు. కొన్ని పరిశోధనలు ఈ రేడియేషన్ ఎక్కువసేపు శరీరానికి దగ్గరగా ఉండటం వల్ల స్పెర్మ్ మొబిలిటీ (చలనం), కౌంట్ (సంఖ్య), మోర్ఫాలజీ (రూపం)పై ప్రభావం పడవచ్చని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్‌ను ఎప్పుడూ జేబులో పెట్టుకోవడం వల్ల వృషణాల దగ్గర ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరో వైపు మొబైల్ నుంచి ఎక్కువగా వేడి రిలీజ్ అవుతుంది. గేమింగ్ లేదా వీడియోలు చూసేటప్పుడు మరింత వేడెక్కుతాయి. ఈ వేడి శరీరానికి దగ్గరగా ఉంటే వృషణాల ఉష్ణోగ్రత పెరగవచ్చు. వృషణాలు సాధారణంగా శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలో ఉండాలి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది.
అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోన్‌ను ఎప్పుడూ ఫ్రంట్ పాకెట్‌లో పెట్టుకోవడం తగ్గించడం మంచిది. అవసరమైతే బ్యాగ్‌లో లేదా చేతిలో ఉంచుకోవచ్చు. కాల్ సమయంలో ఇయర్‌ఫోన్స్ లేదా స్పీకర్ మోడ్ వాడటం కూడా రేడియేషన్ ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తుంది. ల్యాప్‌టాప్‌ను ఒడిలో కాకుండా టేబుల్‌పై పెట్టుకుని వాడటం ఉత్తమం. అలాగే ఎక్కువసేపు వేడెక్కే పరికరాలను శరీరానికి దగ్గరగా ఉంచకపోవడం మంచిది.