Homeబిజినెస్POCO C 81, POCO C 81 X: ఈ రెండు మొబైల్స్ మిడిల్ క్లాస్...

POCO C 81, POCO C 81 X: ఈ రెండు మొబైల్స్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కొనేవే.. ఎప్పుడొస్తున్నాయంటే..

POCO C 81, POCO C 81 X: Xiaomi మొబైల్ కు భారత మార్కెట్లో అత్యంత ఆదరణ ఉంటోంది. అయితే ఈ కంపెనీ సబ్ బ్రాండ్ అయినా POCO కూడా వినియోగదారులకు అనుగుణంగా ఉండే మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి సి 85, C 85 X అనే రెండు మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకువచ్చి ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఇప్పుడు మరో రెండు బ్రాండ్లను ఏప్రిల్ 23న రిలీజ్ […]

POCO C 81, POCO C 81 X: Xiaomi మొబైల్ కు భారత మార్కెట్లో అత్యంత ఆదరణ ఉంటోంది. అయితే ఈ కంపెనీ సబ్ బ్రాండ్ అయినా POCO కూడా వినియోగదారులకు అనుగుణంగా ఉండే మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి సి 85, C 85 X అనే రెండు మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకువచ్చి ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఇప్పుడు మరో రెండు బ్రాండ్లను ఏప్రిల్ 23న రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్, బ్యాటరీ గురించి ముందే ప్రకటించింది. ఈ క్రమంలో కొందరు వినియోగదారులు ఏప్రిల్ 23 కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్స్ మధ్యతరగతి వారికి అనుగుణంగా ఉండడంతో చాలామంది ఈ ఫోన్స్ కొనాలని ఎదురు చూస్తూ ఉంటారు. మరి త్వరలో రాబోయే ఈ మొబైల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

2026 ఏప్రిల్ 23న మధ్యాహ్నం POCO C 81, POCO C 81 X అనే రెండు ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ అయిన తర్వాత వీటిని ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ రెండు ఫోన్లు ఒకే రంగు(బ్లాక్) లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ రెండు మొబైల్స్ లోనూ దాదాపు ఓకే ఫీచర్స్ ఉండగా బ్యాటరీ, డిజైన్ విషయంలో మాత్రం దేనికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

POCO C 81 మొబైల్ లో 6.9 అంగుళాల హెచ్డి ప్లస్ LCD స్క్రీన్ ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో మూవీస్ చూసేవారికి ఈ డిస్ప్లే బాగా సరిపోతుంది. అలాగే ఇందులో UNISOC T 7250 అనే ప్రాసెసర్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 16 తో పాటు సియోమి హైపర్ ఆపరేటింగ్ సిస్టం 3 తో పనిచేసే ఇందులో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే 8 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ మొబైల్ లో 6300 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది. 7.5 W రివర్స్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

POCO C 81 X మొబైల్ లో దాదాపు అన్ని ఫీచర్స్ POCO C 81 లాగే ఉంటాయి. కానీ ఈ మొబైల్ లో బ్యాటరీ 5200 mAh కెపాసిటీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 15 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇవ్వగా..7.5 రివర్స్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. అయితే ఈ మోడల్ సాధారణ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ ధర రూ. రూ,10,000 తో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper