
మనలో చాలామంది తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. రాత్రి సమయంలో కొంతమంది రైస్ తీసుకుంటే మరి కొందరు చపాతీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉత్తరాది ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా రోటీ, చపాతీలను ఆహారంగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. చపాతీలతో పోల్చి చూస్తే బియ్యంలో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు తక్కువగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
అన్నం తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అయితే ప్రస్తుతం పాలీష్‌డ్ బియ్యం మార్కెట్ లో అందుబాటులోకి వస్తుండటంతో ఈ బియ్యంలో విటమిన్లు తక్కువగా ఉంటున్నాయి. చపాతీ, రోటీలలో ఫైబర్, ప్రాథినియెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి తింటే త్వరగా ఆకలి వేయదు. అయితే చపాతీ, రోటీలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, సోడియం ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని భావించే వాళ్లు భోజనంలో చపాతీని చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం రాత్రి సమయంలో రైస్ బదులు చపాతీ తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చపాతీని పప్పు, కూరగాయలు, పెరుగుతో తీసుకుంటే మరీ మంచిది. రాత్రి సమయంలో రైస్ తినే అలవాటు ఉన్నవాళ్లు రైస్ తో పాటు కిచిడి కూడా తింటే మంచిది. రైస్‌లో పప్పు ధాన్యాలు అధికంగా వేసుకుని తింటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుందని చెప్పవచ్చు.
ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం నిపుణుల సలహాలు, సూచనలను పాటించి రైస్ లేదా చపాతీని తీసుకుంటే మంచిది. ఒక రోజులో మూడు పూటలు భోజనం చేస్తే మాత్రం మంచిది కాదని నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.