https://oktelugu.com/

ఆ సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువుగా వెలమ, కాపు రాజకీయాలు నడుస్తుంటాయి. ఏ పార్టీలో చూసినా ఈ కులాల డామినేషన్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందులోనూ తెలుగుదేశం పార్టీలో అయితే ఎప్పటి నుంచో ఈ రాజకీయాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇరువురినీ బ్యాలెన్స్‌డ్‌గా మెయింటెన్‌ చేసేవారు. ఉత్తరాంధ్ర టీడీపీలో ఇప్పుడు సమీకరణల్లో మార్పులు వచ్చాయని కొందరు సీనియర్లు రగిలిపోతున్నారు. పార్టీలో ఒక్క సామాజిక వర్గానిదే పెత్తనం నడుస్తోందనే గుస్సాతో ఉన్నారట. Also Read: ఆంధ్రజ్యోతి ఖాతాలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 10:11 am
    Follow us on

    Chandrababu lose hope

    Did Chandrababu lose hope in that area …?

    ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువుగా వెలమ, కాపు రాజకీయాలు నడుస్తుంటాయి. ఏ పార్టీలో చూసినా ఈ కులాల డామినేషన్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందులోనూ తెలుగుదేశం పార్టీలో అయితే ఎప్పటి నుంచో ఈ రాజకీయాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇరువురినీ బ్యాలెన్స్‌డ్‌గా మెయింటెన్‌ చేసేవారు. ఉత్తరాంధ్ర టీడీపీలో ఇప్పుడు సమీకరణల్లో మార్పులు వచ్చాయని కొందరు సీనియర్లు రగిలిపోతున్నారు. పార్టీలో ఒక్క సామాజిక వర్గానిదే పెత్తనం నడుస్తోందనే గుస్సాతో ఉన్నారట.

    Also Read: ఆంధ్రజ్యోతి ఖాతాలో మరో లీగల్‌ నోటీస్‌

    ఉత్తరాంధ్రలో మొదటి నుంచీ చంద్రబాబు వెలమలకు పెత్తనం ఇస్తూ వచ్చారు. అప్పుడప్పుడు తూర్పు కాపులకు కూడా అవకాశాలు ఇస్తూ వచ్చారు. అది మంత్రి వర్గం కూర్పు అయినా పార్టీ పదవులు అయినా చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఈ రెండు బలమైన సామాజికవర్గాలను కలుపుతూ వచ్చారు. కానీ ఎన్నికల్లో ఓడిన తరువాత బాబు తన ఆలోచనలు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ ఇప్పుడు వెలమలకే టీడీపీలో రాజ్యంగా కనిపిస్తోంది.

    అచ్చెన్నాయుడు ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. దాంతోపాటు ఆయన అసెంబ్లీలో పార్టీ తరఫున ఉప నాయకుడు కూడా. చంద్రబాబుకైతే రైట్‌ హ్యాండ్‌ అన్నట్లే. గతంలోనూ రాష్ట్రంలో ఏది జరిగినా అచ్చెన్న నాయకత్వంలోనే విచారణ కమిటీని వేసే వారు. ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా సీనియర్ నేతగా పొలిట్ బ్యూరోలో ఉన్నారు. మరో నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి కూడా బాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక అదే సామాజికవర్గానికి చెందిన సబ్బం హరిని కూడా బాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌ననాయుడిని జాతీయ ప్రధాన‌ కార్యదర్శిగా, అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చంద్రబాబు తీసుకుని వారికే పెద్దపీట వేశారు.

    Also Read: రిటైర్ మెంట్ పై చంద్రబాబు నోట ఆ మాట వినగలమా..!

    వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు కాపులు రగిలిపోతున్నారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా వెంకటరావు ఏ తప్పూ చేయకున్నా ఆయన్ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించారు. అంతే కాదు.. విశాఖ జిల్లాకు చెందిన కాపు నేత గంటా శ్రీనివాసరావుకి ఏ పదవి ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో బలమైన కాపు నేతగా ఉన్న కొండపల్లి అప్పలనాయుడిని పక్కన పెట్టారని కూడా అంటున్నారు. ఇక అదే జిల్లాలో మహిళా నాయకురాలిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు విజయనగరం ఇన్‌చార్జి పదవి అయినా ఇవ్వలేదని అసంతృప్తిలో ఉన్నారు. అందుకే.. ఈ మధ్య కాపు నాయకులు చాలా మంది వైసీపీ గూటికి చేరారట. ఉత్తరాంధ్రా సహా రాష్ట్రంలో 36 లక్షల మంది దాకా తూర్పు కాపులు ఉన్నారని.. తమపైనే ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా అని ఆ వర్గం వారు కోపంతో ఉన్నారనేది సమాచారం. మరి ఈ లెక్కలను చంద్రబాబు ఎలా బ్యాలెన్స్‌ చేస్తారో చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్