Home Tricks: ఈ చిన్న ప్రయోగంతో మీ ఇంట్లో ఉండే వంటనూనె కల్తీదా..? మంచిదా..? అని తెలుసుకోండి !

Home Tricks: సాధారణంగా వంటకు ఉపయోగించే వంట నూనె మనకు వివిధ రకాల బ్రాండ్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు తోచిన వంట నూనెను మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అయితే గత కొంత కాలం నుంచి నిత్యావసర ధరలు అమాంతం పెరిగి పోవడంతో వంటనూనెల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులకు భారంగా మారిపోయింది.ఇదే అవకాశంగా చేసుకొని ఎంతోమంది వ్యాపారస్తులు కల్తీ నూనెను మార్కెట్లోకి […]

Written By: Navya, Updated On : April 6, 2022 3:45 pm
Follow us on

Home Tricks: సాధారణంగా వంటకు ఉపయోగించే వంట నూనె మనకు వివిధ రకాల బ్రాండ్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు తోచిన వంట నూనెను మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అయితే గత కొంత కాలం నుంచి నిత్యావసర ధరలు అమాంతం పెరిగి పోవడంతో వంటనూనెల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులకు భారంగా మారిపోయింది.ఇదే అవకాశంగా చేసుకొని ఎంతోమంది వ్యాపారస్తులు కల్తీ నూనెను మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు.

ఈ విధంగా కల్తీ నూనెను అమ్ముతూ పెద్ద ఎత్తున డబ్బు పోగు చేసుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారు. ఇలా ఆహారపదార్థాలలో కల్తీని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఏదో రూపంలో ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా వంట నూనెలో పెద్ద ఎత్తున ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి.అయితే మన ఉపయోగించే వంట నూనె స్వచ్ఛమైనదా లేదా అనే విషయాన్ని ఎంతో సులభంగా తెలుసుకోవచ్చని ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక వీడియో ద్వారా వెల్లడించారు.

సాధారణంగా వంటనూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉంది అంటే అది కల్తీ నూనె అని అర్థం. ఇలాంటి నూనెను ఉపయోగించడం వల్ల ఈ రసాయన ప్రభావం నాడీవ్యవస్థ పై పడి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము ఉపయోగించే వంట నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉందో లేదో ఈ సింపుల్ చిట్కా ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసులోకి కొద్దిగా మనం ఉపయోగిస్తున్న వంటనూనెను తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు రంగులో ఉన్న వెన్న వేయాలి.ఇలా మనం వెన్న వేయగానే గ్లాస్ లో ఉన్న నూనె ఎలాంటి రంగు మారకుండా అలాగే ఉంటే ఆ నూనె ఎంతో స్వచ్ఛమైనది అని చెప్పాలి అలా కాకుండా మనం వేయగానే గ్లాస్ లో ఉన్న నూనె ఎరుపు రంగులోకి మారితే ఆ నూనె కల్తీ అని అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉందని అర్థం. ఇలా ఈ సింపుల్ చిట్కా ద్వారా మనం స్వచ్ఛమైన నూనె ఏదో గుర్తించవచ్చు.