https://oktelugu.com/

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లీలల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Tirumala: హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఒకరనే సంగతి తెలిసిందే. వేంకటేశ్వర స్వామి కోరిన కోరికలను కచ్చితంగా నెరవేరుస్తారని భక్తులు బలంగా విశ్వసిస్తారు. భవిష్యోత్తర పురాణ కథనం ప్రకారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంభువుగా అవతరించారు. భక్తులు తిరుమలను కలియుగ వైకుంఠం అని భావిస్తారనే సంగతి తెలిసిందే. తిరుమల ఎల్లప్పుడూ గోవింద నామస్మరణతో మారుమ్రోగుతోంది. శ్రీ మహా విష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించారని భక్తులు నమ్ముతారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తించడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 23, 2022 / 11:16 AM IST
    Follow us on

    Tirumala: హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఒకరనే సంగతి తెలిసిందే. వేంకటేశ్వర స్వామి కోరిన కోరికలను కచ్చితంగా నెరవేరుస్తారని భక్తులు బలంగా విశ్వసిస్తారు. భవిష్యోత్తర పురాణ కథనం ప్రకారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంభువుగా అవతరించారు. భక్తులు తిరుమలను కలియుగ వైకుంఠం అని భావిస్తారనే సంగతి తెలిసిందే. తిరుమల ఎల్లప్పుడూ గోవింద నామస్మరణతో మారుమ్రోగుతోంది.

    Tirumala

    శ్రీ మహా విష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించారని భక్తులు నమ్ముతారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తించడం ద్వారా పాపాలు హరించుకుపోవడంతో పాటు వేంకటేశ్వరస్వామిని పూజిస్తే సకల సౌఖ్యాలు లభ్యమవుతాయని ఆయన భక్తులు నమ్ముతారు. ఎంతసేపు చూసినా వేంకటేశ్వర స్వామిని తనివి తీరదని భక్తులు భావిస్తారు. వేంకటేశ్వర స్వామి రూపంలోనే మహత్యం ఉందని భక్తులు భావిస్తారు.

    Also Read: Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశేఖర్‌ లపై కేసు !

    వేంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వేంకటేశ్వర స్వామి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు పెడతారనే సందేహం చాలామందిని వేధిస్తోంది. స్వామికి కలిగిన గాయంకనిపించకుండా ఉండటం కోసమే పచ్చ కర్పూరంను పెడతారని పురాణాలు చెబుతున్నారు.. శ్రీనివాసుడి లీలలు, మహిమలకు సంబంధించిన కథలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    1979లో తిరుమలలో తీవ్రమైన నీటిఎద్దడి రాగా అక్కడి రిజర్వాయర్ లోని నీళ్లు ఇంకిపోయాయి. యాగం చేయాలన్నా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఆరోజు రాత్రి స్వామి ఆలయంలోని గంటలు మ్రోగగా ఉదయం తలుపులు తెరిచి చూస్తే ఆలయంలో ఎవరూ లేరు. ఆ తర్వాత వరుణ యాగం చేయగా యాగం ఫలితం వల్ల కుంభవృష్టి కురిసింది.

    Also Read: Bigg Boss Akhil: స్ట్రాటజీ మార్చిన అఖిల్.. అతడితో ఫ్రెండ్ షిప్ కట్..!