Eye Health Tips: మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయం ఇంపార్టెంటే. వీటిలో కళ్లా చాలా ప్రధానమైనవి. చూపు లేకపోతే జీవనం కష్టతరం అవుతుంది. మిగతా అవయవాలకంటే కళ్లు చాలా సున్నితమైనవి. వీటిని కాపాడుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్లు బాగుండాలంటే కంటినిండా నిద్రపోవాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. నేటి కాలంలో ఆహార నాణ్యత తక్కువే అని చెప్పవచ్చు. అందువల్ల రెగ్యులర్ ఫుడ్ కాకుండా కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఈ పదార్థాలు మార్కెట్లో విరివిగా లభించేవే. కానీ తరుచూ వీటిని తినడం వల్ల కళ్లకు ప్రత్యేకంగా మేలు చేస్తాయి.. ఇంతకీ ఆ పదార్థాలేవో చూద్దాం..
మార్కెట్లోకి వెళ్లినప్పుడు ఆకు కూరలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ వీటిలో ఏది తినాలి? అనే సందేహం ఉంటుంది. చాలా మంది ఆకు కూరలను అవైడ్ చేస్తారు. కానీ వీటిల్లో మెగ్నీషియం, పోటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పాలకూరలో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లు దెబ్బతినకుండా కాపాడుతాయి. అందువల్ల మార్కెట్లోకి వెళ్లినప్పుడు పాలకూర తప్పనిసరిగా తెచ్చుకోండి. మార్కెట్లో ఆరేంజ్ కలర్లో కనిపించే క్యారెట్ ను చాలా మంది చూస్తారు. కానీ ఎక్కువగా వీటిని కొనడానికి ఇష్టపడరు. కానీ క్యారెట్ లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా లభిస్తుంది.
సిట్రన్ ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవడం కళ్ల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సీ విటమిన్ ఎక్కువగా లభించే ఆరెంజ్, నిమ్మ పండ్లను తరుచూగా తింటూ ఉండాలి. నిమ్మ పండ్లను ఇతర ఆహార పదార్థాల్లో కలిపి తినడం వల్ల రుచిగానూ ఉంటుంది. అలాగే వేసవి కాలంలో నిమ్మపండ్లతో షర్బత్ చేసుకొని తాగడం వల్ల శరీరంలో వేడిని తీసేస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల కంట్లో ఏర్పడే శుక్లాన్ని నివారిస్తుంది. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్యాటీ ఫిస్ కళ్ల ఆరోగ్యానికి సహకరిస్తాయి. ప్యాటీ ఫిష్ లో ఒమెగా 3 యాసిడ్స్ లభిస్తాయి. ఇది రెటీనా సమస్యలను దూరం చేస్తుంది.
ఇవే కాకుండా గింజలు, విత్తనాలు తీసుకోవడం వల్ల కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అయితే వీటిని డైజేషన్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం. ఇలాంటి ఆహార పదార్థాలను మాత్రమే కాకుండా సరైన నిద్రపోవాలి. అలాగే కంప్యూటర్ ముందు పనిచేసేవారు ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడకుండా మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పై ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కళ్లకు సమస్యలు రాకుండా ఉంటాయి.