https://oktelugu.com/

భోగి మంటలెందుకు? భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి? సంప్రదాయం వెనుక కథ

తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద పండుగ ‘సంక్రాంతి’.. భోగి, సంక్రాంతి, కనుమలుగా జరుపుకునే ఈ మూడు రోజుల పండుగ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా బాగా జరుగుతుంది. నెలరోజుల ముందు నుంచి సందడి ఉంటుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందాలు, కొత్త అల్లుళ్ల రాకతో సంక్రంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. Also Read: హైదరాబాద్ లో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణమేంటంటే..? ఈ మూడు రోజుల పండుగను కొన్ని రోజుల్లో నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2021 / 08:56 AM IST
    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద పండుగ ‘సంక్రాంతి’.. భోగి, సంక్రాంతి, కనుమలుగా జరుపుకునే ఈ మూడు రోజుల పండుగ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా బాగా జరుగుతుంది. నెలరోజుల ముందు నుంచి సందడి ఉంటుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందాలు, కొత్త అల్లుళ్ల రాకతో సంక్రంతి సంబరాలు అంబరాన్నంటుతాయి.

    Also Read: హైదరాబాద్ లో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణమేంటంటే..?

    ఈ మూడు రోజుల పండుగను కొన్ని రోజుల్లో నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీన్ని ‘ముక్కనుమ’గా పిలుస్తారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు అద్దం పడుతాయి.

    మూడు పండుగల్లో మొదటిరోజును భోగి పండుగగా జరుపుకుంటారు. ‘భగ’ అనే పదం నుంచి ‘భోగి’ వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. దక్షిణాయానానికి చివరి రోజుగా ‘భోగి’ని భావిస్తారు. అంటే సూర్యడు ఈరోజు మకర రేఖపై భూమి దక్షిణ చివరకు చేరుతాడు. రేపటి నుంచి మన ఉత్తరవైపునకు మరులుతాడు. దక్షిణాయానంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాధించాలనే పరమార్థమే ఈ ‘భోగి’ పండుగ విశిష్టత. అంతేకాదు.. ఈ భోగి పండుగ వస్తూ వస్తూ సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని రైతులకు తెస్తుంది కాబట్టి భోగభాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబరాలు మొదవుతాయి.

    భోగి రోజు సంబరమంతా పిల్లలదే.. భోగి మంటలు, భోగిపళ్లు, పొంగళి తయారీ, తెల్లవారు జాము నుంచే కల్లాపి చల్లి గొబ్బమ్మలు.. రంగు రంగుల రంగవల్లులను తీర్చి దిద్ది ఇంటి ముందు అలంకరిస్తారు.

    Also Read: మోడీకి షాక్ లగా.. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే

    భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టం. నెలరోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివి నుంచి భువికి స్వామి దిగివచ్చాడంటారు. అందుకే భోగి రోజు ‘ముగ్గులతో గొబ్బెమ్మలు’ పెడుతారు.

    భోగి మంటలు పాత చెక్కలతో మంటలు వేసి ఆవుపేడతో పిడకలు వేస్తారు. ఇంటిలోని పాత బట్టలు, పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు. మనలోని చెడును తగులబెట్టి, మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల అంతరార్థం. చిన్నపిల్లలను ఈరోజు అలంకరించి వారికి భోగిపళ్లు పోస్తారు. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని.. పిల్లలకు ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని పెద్దల విశ్వాసం. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలు జ్ఞానవంతులు అవుతారని పూర్వీకుల నమ్మకం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇలా మన పండుగకు ఓ అర్థం పరమార్థం ఉంటాయి. మన ఆచార సంప్రదాయాలు అందరూ ఇప్పటికీ పాటించి వాటిని జరుపుకోవాలని ఆశిస్తూ ‘ఓకే తెలుగు.కామ్’ తరుఫున మీ అందరికీ భోగి శుభాకాంక్షలు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్