https://oktelugu.com/

స్వీటీ అనుష్క ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు !

స్వీటీ అనుష్క శెట్టి.. అబ్బా ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. మళ్ళీ ఇలా దర్శనమిచ్చింది. అది ఏ బెంగళూరులోనే కాదు, మాస్క్ తో ఇలా హైదరాబాద్ లోనే కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఈ రోజు హైదరాబాద్ కి వచ్చింది స్వీటీ. ఎయిర్ పోర్ట్ వద్ద అనుష్క పై లుక్ లో దర్శనమిచ్చి, అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే 40కి చేరువలో ఉన్న అనుష్క దేహంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే, కొత్తగా సినిమాలు కూడా ఒప్పుకోవట్లేదట ఈ ముదురు […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 07:48 PM IST
    Follow us on


    స్వీటీ అనుష్క శెట్టి.. అబ్బా ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. మళ్ళీ ఇలా దర్శనమిచ్చింది. అది ఏ బెంగళూరులోనే కాదు, మాస్క్ తో ఇలా హైదరాబాద్ లోనే కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఈ రోజు హైదరాబాద్ కి వచ్చింది స్వీటీ. ఎయిర్ పోర్ట్ వద్ద అనుష్క పై లుక్ లో దర్శనమిచ్చి, అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే 40కి చేరువలో ఉన్న అనుష్క దేహంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే, కొత్తగా సినిమాలు కూడా ఒప్పుకోవట్లేదట ఈ ముదురు బ్యూటీ. అయితే సినిమాలను మాత్రం మానను.. కనీసం ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒకటి అలా చేసుకుంటూ వెళ్తా అంటూ ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్వీటీ.

    Also Read: మళ్ళీ న్యూడ్ గా నటిస్తా.. ‘రాధికా’ కొత్త సిరీస్ !

    మరి ఆ లెక్కన కొత్త సినిమా కోసం ఏమైనా హైదరాబాద్ వచ్చిందా అన్న డౌట్ మొదలైంది ఆడియన్స్ లో. ఎలాగూ తనకు బాగా నచ్చిన ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకుంటాను అని చెప్పిన స్వీటీకి, కొత్తగా ఏమి నచ్చిందో చూడాలి. లాస్ట్ ఇయర్ ఆమె నటించిన నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలై, అతి పెద్ద ప్లాప్ అయింది. పైగా, ఆ సినిమాలో స్వీటీకి విమర్శలే దక్కాయి. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సీనియర్ భామకు, చివరకు పెద్ద నిరాశే మిగిలింది. ఇక తాజాగా స్వీటీ చేయనున్న సినిమా ప్రస్తుతం చర్చల దశలో ఉంది

    Also Read: 34 ఏళ్ల ‘శృతి హాసన్’.. ఆంటీ పాత్రలకే ఫిక్స్ !

    తనకి బాగా కావాల్సిన సంస్థ ఈ మూవీని నిర్మించబోతుందని.. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఇక అనుష్క శెట్టి పెళ్లి గురించి మొన్నటివరకూ చాలా పుకార్లు షికార్లు చేసినా.. వయసు మొత్తం అయిపోతున్నా.. అనుష్క మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా బాధ పడుతున్నారట. మరోపక్క, నెటిజన్లు మాత్రం అనుష్క పెళ్ళి ప్రభాస్ తో అంటూ.. రోజుకొక రకంగా వార్తలను పుట్టిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అనుష్కనే అని ఓ టాక్ కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో ఉంది. మరి చూడాలి, అనుష్క పెళ్లి ఎప్పుడు అవుతుందో.. ఈ పుకార్లు ఎప్పుడో ఆగుతాయో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్