https://oktelugu.com/

Oil Food: నూనె, మసాలా వంటకాలు ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వస్తాయట!

Oil Food: మనలో చాలామంది నూనె, మసాలా వంటకాలను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. నూనె, మసాలా వంటకాలు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఈ వంటకాల వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు కంటే హాని ఎక్కువనే సంగతి తెలిసిందే. స్పైసీ ఫుడ్ తినేవాళ్లు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూనె, మసాలా వంటకాలు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 12, 2022 3:25 pm
Follow us on

Oil Food: మనలో చాలామంది నూనె, మసాలా వంటకాలను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. నూనె, మసాలా వంటకాలు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఈ వంటకాల వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు కంటే హాని ఎక్కువనే సంగతి తెలిసిందే. స్పైసీ ఫుడ్ తినేవాళ్లు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నూనె, మసాలా వంటకాలు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. తరచూ ఆయిల్ ఫుడ్ ను తీసుకునే వాళ్లు వేడినీళ్లను తాగడం మంచిది. నూనె, మసాలాలతో చేసిన వంటకాలను తినేవాళ్లను కడుపులో నొప్పి, ఉబ్బరం సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

ఆయిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత కొంత సమయం నడిస్తే మంచిది. నూనె పదార్థాలు జీర్ణం కావాలంటే ఎండు మిర్చి, వాము పొడి మిక్స్ చేసి తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆకు కూరలను, నల్ల ఉప్పుతో కలిపి నీటితో మరిగించి తీసుకుంటే మంచిది.

నూనెతో తయారు చేసిన జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. జంక్ ఫుడ్ తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.