Homeఆంధ్రప్రదేశ్‌ABC Survey: ఈనాడును దాటి సాక్షి ఎదిగిందా? ఆంధ్రజ్యోతి పరిస్థితి ఏంటి? తాజా ఏబీసీ లెక్కలు...

ABC Survey: ఈనాడును దాటి సాక్షి ఎదిగిందా? ఆంధ్రజ్యోతి పరిస్థితి ఏంటి? తాజా ఏబీసీ లెక్కలు ఏం చెబుతున్నాయంటే..

ABC Survey: బార్క్ రేటింగ్స్ టీవీ పాపులారిటీని నిర్ధారిస్తాయి. అయితే ఇందులోనూ బోలెడు మరకలు ఉంటాయి. లెక్కకు మిక్కిలి దండాలు ఉంటాయి. రిపబ్లిక్ టీవీ ఉదంతంలో జరిగింది అదే. ఇక పేపర్ పరంగా చూసుకుంటే ఆడిట్ బ్యూరో కౌన్సిల్ స్థూలంగా ఏబిసి అనేది ఉంటుంది. అయితే ఇదేం సుద్దపూస కాదు. ఇందులోను బొచ్చెడు బొక్కలు ఉంటాయి. ఏ బి సి కాకుండా రీడర్షిప్ పేరుతో ఒక సర్వే ఉంటుంది గాని.. దానికి ఆశించినత స్థాయిలో పారదర్శకత ఉండదు. ఆయన ఇప్పుడున్న రోజుల్లో సీఏ సర్టిఫికెట్ తెప్పించుకొని.. అందులో ఏదేదో రాయించుకొని.. ఐఆర్పిఆర్ జాబితా ఎన్పనల్ చేర్పించుకొని వందల కోట్ల ప్రజాధనాన్ని దర్జాగా దాచేసుకుంటారు. ఇలాంటి అప్పుడు ఏబీసీ అనేది జస్ట్ ఓ సో కాల్డ్ సర్వే మాత్రమే అవుతుంది. సరే ఇప్పటికి ఇప్పుడు పత్రికలకు అదే ప్రామాణికం కాబట్టి ఒకసారి దానిని పరిశీలిస్తే..

మలయాళ పత్రికలు దరఖాస్తు చేసుకోలేదు

ఈసారి ఏబీసీ సర్వే లో మలయాళం లో పాపులర్ అయిన మలయాళ మనోరమ, మాతృభూమి వంటి పత్రికలు కనిపించలేదు. ఎందుకని ఆరా తీస్తే అవి ఏబిసి కోసం అప్లై చేసుకోలేదు. మొత్తంగా చూస్తే ఆ సర్టిఫికెట్ కూడా మాకొద్దని అవి తీసి పారేసాయి. ఫలితంగానే టాప్ -8 లోకి సాక్షి వచ్చిందని తెలుస్తోంది. ఇక అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్లు సాక్షిని కొనుగోలు చేశారు. అప్పుడు ఏకంగా ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని వార్తలు వచ్చాయి. దీనికి వ్యతిరేకంగా ఈనాడు కోర్టుకు వెళ్ళింది. అయితే 2023 అర్థ సంవత్సరంతో పోల్చి చూపిస్తే 2024 జనవరి నుంచి జూన్ వరకు ఈనాడు సర్క్యులేషన్ లో కాస్త కదలిక వచ్చింది. ఈ లెక్కన వాలంటీర్ల డబ్బుతో సాక్షిని కొనుగోలు చేశారని ఈనాడు పెట్టిన గగ్గోలుకు అర్థం లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది జూలై నుంచి లెక్క చూస్తే ఈనాడు పరిస్థితి ఏమిటి? సాక్షి పరిస్థితి ఏమిటి అనేది తెలుస్తుంది. ప్రస్తుతం చెబుతున్నట్టుగా టాప్ -8 ప్లేస్ ఉంటుందా? మరింత దిగజారుతుందా? అనేవి కూడా తేలుతాయి.

ఆంధ్రజ్యోతి 3.93 లక్షలు

ఇక ఈనాడు, సాక్షి విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రజ్యోతి సర్కులేషన్ 3.93 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు ఈనాడు 14.89 లక్షల సర్కులేషన్ కొనసాగిస్తుండగా.. సాక్షి 12.47 సర్క్యులేషన్ తో రెండవ స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అటు జగన్ కు, ఇటు దివంగత రామోజీరావుకు చాలా దూరంలో ఉంది.. అలాంటి పత్రికను పట్టుకొని జగన్ తన శత్రువు అన్నాడు. పాపం ఆయనకు ఎన్నికల సమయంలో స్పీచ్ రాసిచ్చిన వ్యక్తులకు దండం పెట్టాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular