Eye signs kidney problems: మానవ శరీరంలో ఉండే అత్యంత సున్నితమైన అవయవం కళ్ళు. వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారం, అలవాట్లు కారణంగా కంటి సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైన కూడా కంటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కాళ్లలో కనిపించే కొన్ని లక్షణాలతో కిడ్నీల పనితీరులో లోపాలు గుర్తించవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. అసలు కళ్ళకు, కిడ్నీలకు సంబంధం ఎలా ఉంటుంది? కిడ్నీలో సమస్యలు ఉంటే కళ్ళు ఎలా తెలుపుతాయి?
కళ్ళు, కిడ్నీలు మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలే. అయితే వీటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పటికీ సంబంధం మాత్రం ఉంటుంది. శరీరంలోకి రక్తనాళాల ద్వారా ద్రవాలు వెళ్తుంటాయి. ఈ ద్రవాల్లో విష పదార్థాలు ఉంటే అవి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదముంది. ఈ రక్తనాళాలు కళ్ళలోని నరాలపై ప్రభావం చూపుతాయి. అందుకే కిడ్నీలో సమస్యలు ఉంటే కళ్ళపై చూడవచ్చు. అయితే కిడ్నీలో ఉండే సమస్యలను కళ్ళు ఎన్ని రకాలుగా తెలుపుతాయంటే..?
కిడ్నీలో సమస్యలు ఉంటే కళ్ళు ఎర్రబడుతుంటాయి. కొన్నిసార్లు కళ్ళు మండినట్లు అనిపించడం.. అలసట ఎక్కువగా ఉండడం.. నిద్రలేమి సమస్యలు ఉండడంతో కిడ్నీల పనితీరుపై కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీలో సమస్యలు ఉంటే శరీరంలో టాక్సిన్స్ పేరుకు పోతాయి. ఇవి రక్త ప్రసరణ పై ప్రభావం చూపి కళ్ళలో ఎర్రదనం తీసుకువస్తాయి. కళ్ళు రంగులను స్పష్టంగా గుర్తించలేక పోతే కిడ్నీలో సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి. కిడ్నీ సమస్యల వల్ల కళ్ళ నరాలకు సరైన పోషకాలు అందకపోవచ్చు. ఈ ప్రభావంతో రంగులను గుర్తించే శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారిలో ఈ లక్షణం వెంటనే కనిపిస్తుంది.
కొన్నిసార్లు ఒక వస్తువు రెండుసార్లు కనిపిస్తుంది. లేదా చూపు మసకబారుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా కిడ్నీలో సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. రక్తంలో వ్యర్థాలు పెరిగి కంటి నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల దృష్టిలోపం ఏర్పడి ఒక వస్తువు రెండుసార్లు లేదా బ్లర్ గా కనిపిస్తుంది. మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూస్తున్నప్పుడు ఎక్కువగా ఒకే వైపు చూడలేకపోతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఉందని గుర్తించాలి. కిడ్డీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో నీటి శాతం దెబ్బతింటుంది. దీంతో ఒత్తిడి పెరిగి పోకస్పై ప్రభావం పడుతుంది. కళ్ళు పొడిబారడం, తరచూ దురద రావడం, సాధారణ అలర్జీ అనిపించినా కూడా కిడ్నీ సమస్యలే అని అనుకోవాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కళ్ళలో తేమ తగ్గుతుంది. దీంతో కళ్ళు పొడుపారుతుంటాయి. అలాగే కళ్ళ చుట్టూ ఉబ్బినట్లు వలయం ఏర్పడితే కూడా కిడ్నీ సమస్యలే. ఉదయం లేచిన వెంటనే కళ్ళ చుట్టూ వాపు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు.