Hair Color Tips: సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో మరింత సమస్య ఎక్కువ కనిపిస్తుంది.అయితే తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం. మరి చిన్న వయసులోనే ఈ సమస్యకు రావడం చాలా బాధాకరం కదా. చాలా మంది ఎగతాళి చేస్తారేమోనన్న భయం, ఆందోళన కూడా ఉంటుంది. దీంతో.. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి వివిధ రకాల డైలు, ఖరీదైన ప్రొడక్ట్స్, షాంపూలు వాడటం చాలా మందికి అలవాటుగా మారింది.
అయితే, చాలా మంది తాత్కాలిక ఉపశమనం కోసం జుట్టుకు కలర్స్ వాడుతున్నారు. మార్కెట్లో దొరికే వాటితో జుట్టుకు రంగు వేసుకుంటున్నారు. కొందరు తెల్ల జుట్టు కనబడవద్దని, మరికొందరు ఫ్యాషన్ కోసం రంగు వేసుకుంటున్నారు. కొందరు ఇంట్లోనే కలర్ వేసుకుంటారు. మరికొందరు సెలూన్లలో జుట్టుకు హెయిర్ కలర్ చేయించుకుంటున్నారు. అయితే, చాలా సార్లు ఈ రంగులు కొద్ది రోజుల్లోనే ఫేడ్ అవుతున్నాయి. కానీ ఈ జుట్టుకు రంగు వేసుకునే విషయంలో చేసే పొరపాట్ల వల్ల జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. మరి ఆ సమస్యలు ఏంటంటే?
జుట్టు కలర్ చేసుకున్న తర్వాత చాలా మంది జుట్టుకు సరైన కేర్ తీసుకోరు. జుట్టుకు రంగు వేసిన తర్వాత ప్రత్యేకమైన షాంపూ అవసరం. దీనిని కలర్-ప్రొటెక్టింగ్ షాంపూ అంటారు. ఈ షాంపూలు జుట్టు రంగు త్వరగా పోకుండా నివారిస్తాయి. హెయిర్ కలరింగ్ తర్వాత.. రంగు ఎక్కువ కాలం నిలవాలంటే.. సాధారణ షాంపూకి బదులుగా కలర్ ప్రొటెక్టింగ్ షాంపూని వాడాలని నిపుణులు చెబుతున్నారు.
జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత వేడి నీటిస్నానం చేయడం కామన్. కానీ ఇలా అసలు చేయవద్దు. ఎందుకంటే ఈ వేడి నీరు మీ కలర్‌ని త్వరగా మసకబారేలా చేస్తుంది. జుట్టు వాష్ చేసుకోవడానికి చల్లని నీరు లేదా గోరు వెచ్చని నీరును ఉపయోగించాలి.
చాలా మంది జుట్టు రంగు కోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, ఆ ప్రొడక్ట్స్ మీద జుట్టుకు రంగు ఎలా వేసుకోవాలి.. ఏ రూల్స్ ఫాలో అవ్వాలో ఉంటుంది. కానీ, ఈ రూల్స్ చాలా మంది ఫాలో అవ్వరు. ఎలా పడితే అలా రంగు వేసుకుంటారు. దీంతో.. జుట్టు రంగు త్వరగా మసకబారిపోతుంది.
రంగు వేసుకున్న వెంటనే కొందరు స్ట్రెయిట్‌నర్‌లు లేదా కర్లర్‌ల వంటి హీటింగ్ సాధనాలను వాడుతుంటారు. వీటి వల్ల జుట్టుకు హాని కలగుతుంది. అంతేకాదు రంగు కూడా త్వరగా పోతుంది. అందుకే హెయిర్ కలరింగ్ తర్వాత వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కేశాలు శుభ్రంగా లేకపోతే రంగు సరిగా అంటుకోదని గుర్తించుకోవాలి. సో కలర్ వేసుకునే ముందే తలస్నానం కచ్చితంగా చేయాలి. అంతేకాకుండా కొత్త ప్రొడక్ట్ వాడేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా ఎండలో ఎక్కువ సేపు ఉండే హెయిర్ డై త్వరగా మాసిపోతుంది. సో సూర్యకిరణాల నుంచి కాపాడుకోవాలంటే క్యాప్, ఖర్చీఫ్, స్కార్ఫ్ వంటివి ఉపయోగించాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..