Horoscope Today: దీపావళి వేళ ఈ రాశి వ్యాపారులు నొక్కి తోక తొక్కినట్లే…

కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. లక్ష్యాన్ని పూర్తి చేయడంతో మనోధైర్యం పెరుగుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు.

Written By: Srinivas, Updated On : October 30, 2024 7:57 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం సమయంలో సర్వార్థ సిద్ధయోగం ఏర్పడనుంది. మరోవైపు దీపావళి పర్వదినం సందర్భంగా కొన్ని రాశుల వ్యాపారులకు అనుకొని లాభాలే ఉంటాయి. మరికొందరు పెట్టుబడుల విషయంలో ఆలోచించాలి. మేషంతో సహా 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. వ్యాపారులకు అనుకోని ధనలాభం ఉంటుంది.

వృషభ రాశి:
కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. లక్ష్యాన్ని పూర్తి చేయడంతో మనోధైర్యం పెరుగుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు.

మిథున రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయం ఉంటుంది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఆలోచన శక్తి పెరుగుతుంది.

కర్కాటక రాశి:
ఇప్పటికే చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగాలు ఉల్లాసంగా ఉంటారు.

సింహారాశి:
కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అయితే కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరి విషయంలో ఆలోచించి ముందడుగు వేయాలి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

కన్య రాశి:
వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారులకు అనుకొని ధన లాభం ఉంటుంది. శత్రువులపై ఒక కన్నేసి ఉంచండి.

తుల రాశి:
కీలక పనులు పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేముందు పెద్దల ను సంప్రదించాలి. ఉద్యోగులు సీనియర్లతో సత్సంబంధాలు మెరుగుపరచుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:
ఈ రాశి వ్యాపారులకు కలిసి వస్తుంది. ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. సాయంత్రం శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

ధనస్సు రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. అయితే కొన్ని పరిహారాల వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు భాగస్వామూలతో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి:
కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించాలి. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రసంగంలో చెడు వాక్యాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాగ్వాదాలకు దిగకుండా ఉండాలి. ఉల్లాసమైన వాతావరణంలో గడుపుతారు.

కుంభరాశి:
ధనం విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారులకు ఈరోజు కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. లక్ష్యాన్ని పూర్తి చేయడంతో సీనియర్ల నుంచి ప్రశంశాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి:
ఈ రాశి వారు ఈ రోజంతా ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో తోటి ఉద్యోగులతో సంతోషాన్ని పంచుకుంటారు. వ్యాపారులు సైతం ధన లాభం పొందడంతో ప్రశాంతంగా ఉంటారు. సాయంత్రం శుభ కార్యాల్లో పాల్గొంటారు.